Urvashi Rautela: నాడు ప‌వ‌న్‌తో.. నేడు జూనియ‌ర్‌తో! అమ్మ‌డి రూటే స‌ప‌రేటు

ABN , Publish Date - Apr 15 , 2024 | 10:29 PM

అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో, ప్రైవేట్ వీడియో అల్బ‌మ్స్‌ల‌లో న‌టిస్తూ ఎక్కువగా ఈవెంట్‌ల‌తో సంద‌డి చేసే బాలీవుడ్ ముద్దుగుమ్మ, మోడ‌ల్ ఊర్వ‌శి రౌతేలా మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది.

Urvashi Rautela: నాడు ప‌వ‌న్‌తో.. నేడు జూనియ‌ర్‌తో! అమ్మ‌డి రూటే స‌ప‌రేటు
urvashi

అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో, ప్రైవేట్ వీడియో అల్బ‌మ్స్‌ల‌లో న‌టిస్తూ ఎక్కువగా ఈవెంట్‌ల‌తో సంద‌డి చేసే బాలీవుడ్ ముద్దుగుమ్మ, మోడ‌ల్ ఊర్వ‌శి రౌతేలా (Urvashi Rautela) మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుసగా ఐటం సాంగ్స్ చేస్తూ మోస్ట్ వాంటెడ్ న‌టిగా మారిన ఈ సుంద‌రి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఐటం సాంగ్ అంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చే న‌టిగా ప్ర‌త్యేక గుర్తింపును సైతం ద‌క్కించుకున్న‌ది.

ntr.jpeg

వాల్తేర్ వీర‌య్య చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ చిన్న‌ది త‌ర్వాత‌ బ్రో, ఏజెంట్‌, స్కంద‌ సినిమాల్లోనూ ప్ర‌త్యే గీతాల్లో అల‌రించి బిజీ ఆర్టిస్ట్‌గా మారింది. అంతేకాక బాల‌కృష్ణ 109 సినిమాలో మెయిన్ లీడ్‌లో న‌టిస్తోందడడం విశేషం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ త‌న పోస్టుల‌ను అభిమానుల‌తో పంచుకుంటూ ఉంటుంది. ఈక్ర‌మంలో తాజాగా సోమ‌వారం మ్యాన్ ఆఫ్ మాసెస్ , గ్లోబ‌ల్ స్టార్ జూ.ఎన్టీఆర్‌తో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేయ‌గా నెట్టింట హాల్‌చ‌ల్ అవుతోంది.

pawan.jpeg


ప్ర‌స్త‌తుం జూ.ఎన్టీఆర్‌ న‌టిస్తోన్న బాలీవుడ్ చిత్రం వార్‌2 సినిమా షూటింగ్ నిమిత్తం ముంబ‌య్‌లో ఉండ‌గా అక్క‌డ జిమ్ ట్రైనింగ్ తీసుకుంటున్న సంద‌ర్భంలో ఊర్వ‌శి ఎన్టీర్‌తో సఎల్ఫీ తీసుకుని త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసి మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్‌స్టార్. క్రమశిక్షణ, నిజాయితీ, గ‌ల‌ వ్యక్తి జూనియర్‌ ఎన్టీఆర్‌. మీ ప్రేమ‌కు కోటి ధన్యవాదాలు. మీ సింహం లాంటి వ్యక్తిత్వం ప్రశంసనీయం. రానున్న రోజుల్లో మీతో కలిసి పని చేసే అవకాశం కోసం వేచి ఉండలేకపోతున్నా.. అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. దదీంతో ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుండ‌గా గ‌తంలో ప‌వ‌న్‌తో దిగిన ఫొటోను జ‌త చేసి కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - Apr 15 , 2024 | 10:34 PM