Kannappa: కన్నప్ప కోసం అక్షయ్‌.. విష్ణు అధికారిక ప్రకటన

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:39 AM

కన్నప్ప చిత్రం కోసం ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు మంచు విష్ణు. ఈ చిత్రంలో కోసం దేశంలో స్టార్‌లను దింపుతున్నారు. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కోసం ఖర్చు ఎంతైనా పర్వాలేదంటున్నారు.

Kannappa: కన్నప్ప కోసం అక్షయ్‌.. విష్ణు అధికారిక ప్రకటన
Akshay kumar Entry for Kannappa

కన్నప్ప (kannappa)చిత్రం కోసం ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు మంచు విష్ణు(Manchu Vishnu). ఈ చిత్రంలో కోసం దేశంలో స్టార్‌లను దింపుతున్నారు. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కోసం ఖర్చు ఎంతైనా పర్వాలేదంటున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్నఈ చిత్రం సెట్‌లోకి బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌కుమార్‌ అడుగుపెట్టారు. ఈ చిత్రంలో అక్షయ్‌ (Akshay kumar కీలక పాత్ర పోషిస్తున్నారనే గతవారం రోజులుగా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దాన్ని నిజం చేస్తూ మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.


Kannappa.jpg
మోహన్‌ బాబు (Mohan Babu) నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్‌ ఫేమ్‌ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ‘కన్నప్ప’ పాత్రలో మంచు విష్ణు నటిస్తుండగా ప్రభాస్‌, మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివ రాజకుమార్‌, నయనతార, మధుబాల వంటి స్టార్‌ నటీనటులు భాగమైన సంగతి తెలిసిందే! తాజాగా అక్షయ్‌ కుమార్‌ రాకతో మంచి బాలీవుడ్‌ టచ్‌ కూడా ఇచ్చినట్లయింది. కన్నప్ప సినిమాతో అక్షయ్‌ కుమార్‌ తెలుగు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు.


1993లో ఓ కన్నడ సినిమాలో కనిపించిన అక్షయ్‌ ఆ తర్వాత 2018లో రజినీకాంత్‌ రోబో2.0 సినిమాతో తమిళ ఇండస్ర్టీలో అడుగుపెట్టాడు. కన్నప్పలో శివుడిగా అక్షయ్‌ కుమార్‌ని లాక్‌ చేశారని సమాచారం. ఓ మై గాడ్‌ 2లో ఇలాంటి పాత్రలో కనిపించారు అక్షయ్‌.

Updated Date - Apr 16 , 2024 | 12:16 PM