Raj Tarun: రాజ్ తరుణ్, రాశి సింగ్‌ల సినిమాకు క్లాప్ పడింది..

ABN , Publish Date - Apr 12 , 2024 | 08:48 PM

రాజ్ తరుణ్ హీరోగా గోవిందరాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్.పి ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా ప్రారంభ పూజ శుక్రవారం రామానాయుడు స్టూడియోస్‌లోజరిగింది. నూతన దర్శకుడు రమేష్ కడుముల‌ని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Raj Tarun: రాజ్ తరుణ్, రాశి సింగ్‌ల సినిమాకు క్లాప్ పడింది..
Raj Tarun New Movie Launch

రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా గోవిందరాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్.పి (Connect Movies LLP) ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా ప్రారంభ పూజ శుక్రవారం రామానాయుడు స్టూడియోస్‌లోజరిగింది. నూతన దర్శకుడు రమేష్ కడుముల‌ (Ramesh Kadumula)ని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. రాశి సింగ్ (Raasi Singh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్, డైరెక్టర్ నక్కిన త్రినాధ రావు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత వివేక కూచిబొట్ల తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ మారుతి క్లాప్ కొట్టగా.. ప్రవీణ్ సత్తార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నక్కిన త్రినాధరావు ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేయగా ఎస్.కె.ఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ స్క్రిప్ట్ అందజేశారు.

*Bhaje Vayu Vegam: కార్తికేయ గుమ్మకొండ హీరోగా ‘భజే వాయు వేగం’.. సూపర్‌స్టార్ సపోర్ట్


ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ కడుముల మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ ఈనెల 15 నుండి ప్రారంభమవుతుంది. కంటిన్యూ షూటింగ్ వుంటుంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది క్రైమ్ కామెడీ. ‘స్వామిరారా, అంధధూన్’ తరహాలో వుంటుంది. కథ చాలా అద్భుతంగా వుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథుఅందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. ప్రొడ్యూసర్ కేఐటిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ... కథ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది. ఏప్రిల్ 15 నుంచి షూటింగ్‌కి వెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులకు అలాగే ముఖ్య అతిథులకు పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. (Raj Tarun New Movie Opening)


Raasi-Singh.jpg

మాధవి అద్దంకి మాట్లాడుతూ.. దర్శకులు రమేష్ చాలా ప్రతిభావంతుడు. ఈ సినిమా కథ, కథనం చాలా అద్భుతంగా వుంటుంది. ఈ సినిమా ప్లాట్ చాలా కొత్తగా వుంటుంది. ఈ సినిమాకు హీరోగా రాజ్ తరుణ్, హీరోయిన్ రాశి యాప్ట్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలని తెలపగా.. ఫేవరట్ జోనర్‌లో నటిస్తున్నానని రాజ్ తరుణ్, ఈ సినిమాలోని పాత్ర ఎంతగానో నచ్చిందని హీరోయిన్ రాశీ సింగ్ తెలిపారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Manjummel Boys: తెలుగు వెర్షన్ ప్రదర్శనలను నిలిపేసిన పీవీఆర్ మల్టిఫ్లెక్స్

**********************

*Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..

****************************

Updated Date - Apr 12 , 2024 | 08:48 PM