Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..

ABN , Publish Date - Apr 10 , 2024 | 10:56 PM

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా.. కొత్త దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆ ఒక్కటి అడక్కు’. ఈ చిత్రానికి భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ ఈ చిత్ర ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది.

Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ తెలుగు రాష్ట్రాల హక్కులు ఎవరికంటే..
Aa Okkati Adakku Movie Still

కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా.. కొత్త దర్శకుడు మల్లి అంకం (Malli Ankam) దర్శకత్వంలో చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక (Rajiv Chilaka) నిర్మించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆ ఒక్కటి అడక్కు’ (Aa Okkati Adakku). ఈ చిత్రానికి భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ (Asian Suresh Entertainment LLP) ఈ చిత్ర ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ వేసవిలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

*Tamannaah: ‘బాక్’‌లో శివానిగా తమన్నా.. లుక్ అదిరింది


Aa-Okkati-Adakku.jpg

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పోస్టర్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తగిన వినోదాన్ని అందిస్తుందని, ఇందులో లీడ్ పెయిర్ మధ్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరి ఇతర కీలక పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రాఫర్ కాగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. (Aa Okkati Adakku Movie)


ఇవి కూడా చదవండి:

====================

*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!

*********************

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

Updated Date - Apr 10 , 2024 | 10:56 PM