Naga Chaitanya: చైతూని టార్గెట్ చేస్తూ.. వెంటాడుతోన్న విడాకులు

ABN , First Publish Date - 2023-07-18T17:45:01+05:30 IST

అదేంటి.. సమంతతో నాగచైతన్యకు విడాకులు అయిపోయాయిగా.. సమంత తన బతుకు తాను బతుకుతోంది. చైతూ కూడా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. మరి చైతూని విడాకులు వెంటాడటం ఏమిటని అనుకుంటున్నారా? అదే ట్విస్ట్. విషయంలోకి వస్తే.. ‘సామజవరగమన’ చిత్రంతో సూపర్ సక్సెస్ కొట్టిన రామ్ అబ్బరాజు.. తన తదుపరి విడాకుల కాన్సెప్ట్‌తో చైతూతో ఓ చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడట.

Naga Chaitanya: చైతూని టార్గెట్ చేస్తూ.. వెంటాడుతోన్న విడాకులు
Hero Naga Chaitanya

అదేంటి.. సమంత (Samantha)తో నాగచైతన్య (Naga Chaitanya)కు విడాకులు అయిపోయాయిగా.. సమంత తన బతుకు తాను బతుకుతుంది. చైతూ కూడా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. మరి చైతూని విడాకులు వెంటాడటం ఏమిటని అనుకుంటున్నారా? ప్రస్తుతం సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. తన హెల్త్‌పై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతుండగా.. చైతూ ఏమో వరుస సినిమాలతో గతాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్య చైతూ రెండో పెళ్లికి సంబంధించి కూడా వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ చైతూని టార్గెట్ చేస్తుందా? అని అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదు. ఇది నాగచైతన్య నెక్ట్స్ చేయబోయే సినిమాకు సంబంధించిన మ్యాటర్.


విషయంలోకి వస్తే.. రీసెంట్‌గా ‘సామజవరగమన’ (Samajavaragamana) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజు (Ram Abbaraju).. ఇటీవల చైతూకి ఓ కథని వినిపించాడట. ఈ కథ మొత్తం విడాకుల చుట్టూ తిరుగుతూ.. హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేసేలా ఉండటంతో.. కథ విన్న చైతూ వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పాడని.. టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ వార్త వినిపిస్తోంది. అంతే.. చైతూని విడాకులు టార్గెట్ చేస్తున్నాయనేలా ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. సమంతతో విడాకుల తర్వాత.. ఇప్పుడు చైతూ మళ్లీ ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తే.. అతన్ని మరింతగా జనాలు టార్గెట్ చేస్తారనేలా అక్కినేని ఫ్యాన్స్ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Chaitu.jpg

మరో వైపు నాగచైతన్య నటించిన ‘కస్టడీ’ (Custody) సినిమా రీసెంట్‌గా విడుదలై యావరేజ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అర్జెంట్‌గా అతనికి హిట్ బొమ్మ పడాలి. ప్రస్తుతం చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో ఓ సినిమాను చైతూ లైన్‌లో పెట్టారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో.. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తవ్వగానే.. ‘సామజవరగమన’ దర్శకుడితో చైతూ మూవీ ఉంటుందనేలా టాక్ వినబడుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

**************************************

*Project K: దీపికా.. కళ్లతోనే కొత్త ప్రపంచంలోకి.. లుక్ వైరల్

**************************************

*Nayanthara: తుఫాను వచ్చే ముందు ఉరిమే మేఘం..

**************************************

*Hidimbha Reverse Trailer: టాలీవుడ్‌లో తొలిసారి సరికొత్త ప్రయోగం

**************************************

*NTR and Krishna: రెండు చిత్రాలు.. కథ మాత్రం ఒక్కటే.. అప్పట్లోనే ఇలా జరిగిందనే విషయం తెలుసా?

**************************************

*Saindhav: గాయత్రిగా సారా.. లుక్ విడుదల

**************************************

*Ketika Sharma: ‘బ్రో’ సినిమాకు ఆయన పేరు చాలు

**************************************

Updated Date - 2023-07-18T17:45:01+05:30 IST