Project K: దీపికా.. కళ్లతోనే కొత్త ప్రపంచంలోకి.. లుక్ వైరల్

ABN , First Publish Date - 2023-07-18T14:47:30+05:30 IST

రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ఇప్పటికే అనేక ఆకర్షణలతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి లేడీ వారియర్ గెటప్‌లో ఉన్న దీపికా పదుకొణె లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Project K: దీపికా.. కళ్లతోనే కొత్త ప్రపంచంలోకి.. లుక్ వైరల్
Deepika Padukone Look From Project K

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’ (Project K). ఇప్పటికే అనేక ఆకర్షణలతో దేశవ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది. ఇండియన్ సూపర్ స్టార్స్ ఎందరో ఈ చిత్రంలో అలరించనున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి వారంతా ఈ సినిమాలో ప్రభాస్‌ (Prabhas)తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుండటం విశేషం. తాజాగా ఈ సినిమాలోని దీపికా పదుకొణె (Deepika Padukone) లుక్‌ని మేకర్స్ రివీల్ చేశారు.


ఆమె కళ్లలో కొత్త ప్రపంచానికి సంబంధించి ఆశ ఉందంటూ.. విడుదల చేసిన దీపిక పదుకొణె లుక్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. లేడీ వారియర్ గెటప్‌లో ఈ లుక్‌లో ఆమె కనిపిస్తోంది. ఈ లుక్‌పై ప్రశంసలతో పాటు కొందరు విమర్శకులు కూడా చేస్తుండటం గమనార్హం. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో హీరోయిన్ లుక్ రివీల్ చేస్తున్నామంటూ.. ఓ సాదాసీదా ఫొటోను విడుదల చేస్తారా? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అదలా ఉంటే.. ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ భారత్‌లో జూలై 21న, అమెరికాలో జూలై 20న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘ప్రాజెక్ట్ K’ శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా రికార్డ్‌ను క్రియేట్ చేయబోతోంది. ఈ వేడుకకు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు. (Deepika Padukone Look in Project K Out)

Project-K.jpg

వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న బహుభాషా సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ఈ చిత్రంతో సినిమా నిర్మాణ చరిత్రలో వైజయంతీ మూవీస్ సక్సెస్ ఫుల్‌గా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది. ప్రాజెక్ట్ K జనవరి 12, 2024న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Nayanthara: తుఫాను వచ్చే ముందు ఉరిమే మేఘం..

**************************************

*Hidimbha Reverse Trailer: టాలీవుడ్‌లో తొలిసారి సరికొత్త ప్రయోగం

**************************************

*NTR and Krishna: రెండు చిత్రాలు.. కథ మాత్రం ఒక్కటే.. అప్పట్లోనే ఇలా జరిగిందనే విషయం తెలుసా?

**************************************

*Saindhav: గాయత్రిగా సారా.. లుక్ విడుదల

**************************************

*Ketika Sharma: ‘బ్రో’ సినిమాకు ఆయన పేరు చాలు

**************************************

*Nidhhi Agerwal: పవర్‌స్టార్‌కి థ్యాంక్స్ చెప్పిన నిధి.. పోస్ట్ వైరల్

**************************************

Updated Date - 2023-07-18T14:47:30+05:30 IST