Nayanthara: తుఫాను వచ్చే ముందు ఉరిమే మేఘం..

ABN , First Publish Date - 2023-07-18T13:15:10+05:30 IST

‘జవాన్’.. ప్రేక్ష‌కుల్లో రోజురోజుకీ అంచ‌నాలు పెంచేస్తోన్న సినిమా ఇది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ సినిమాపై ఎక్కడా లేని క్రేజ్‌కి కారణం అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి.. తుఫాను వచ్చే ముందు ఉరిమే మేఘం అంటూ నయనతార న్యూ పోస్టర్‌ని మేకర్స్ రివీల్ చేశారు.

Nayanthara: తుఫాను వచ్చే ముందు ఉరిమే మేఘం..
Nayanthara in Jawan

‘జవాన్’.. ప్రేక్ష‌కుల్లో రోజురోజుకీ అంచ‌నాలు పెంచేస్తోన్న సినిమా ఇది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ సినిమాపై ఎక్కడా లేని క్రేజ్‌కి కారణం అవుతోంది. ‘జ‌వాన్’ (Jawan) నుంచి నెక్స్ట్ ఎలాంటి అప్‌డేట్ వ‌స్తుందా? అని ప్రేక్షకులు ఆత్రుత‌తో ఎదురుచూస్తున్నారంటే.. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ పోస్టర్‌లో చూడ‌గానే స్ట‌న్నింగ్‌గా, యాక్ష‌న్ ప్యాక్డ్ అవ‌తార్‌లో మెప్పిస్తున్నారు న‌య‌న‌తార‌ (Nayanthara). తుఫాను వచ్చే ముందు ఉరిమే మేఘం అంటూ ఆమె పోస్టర్‌ని మేకర్స్ రివీల్ చేశారు.


‘జ‌వాన్’ నుంచి వచ్చిన ఈ న‌య‌న‌తార లుక్‌కి అంద‌రూ ఫిదా అవుతున్నారు. ప్రివ్యూలో ఆమె లుక్ చూసిన వాళ్లు సినిమాలో మ‌రో రేంజ్‌లో ఉండి తీరుతుంద‌ని ఫిక్స్ అయ్యారు. ఈ పోస్ట‌ర్ వారి అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా డిజైన్ చేశారు. ఈ మధ్య కాస్త పెద్దరికం ఉన్న పాత్రలలో నయనతార కనిపించేసరికి.. ఈ సినిమాలో ఎలా ఉంటుందో అని అంతా అనుకున్నారు కానీ.. నయనతారలోని ఆ స్టైలిష్‌ని ఈ పోస్టర్ సరికొత్తగా ప్రజంట్ చేస్తోంది. (Nayanthara Stylish Look From Jawan)

సౌత్ ఇండియాలో త‌లైవిగా, లేడీ సూప‌ర్‌స్టార్‌గా మెప్పించిన న‌య‌న‌తార‌కు బాలీవుడ్‌లో ఇది తొలి సినిమా. ప్ర‌ప్ర‌థ‌మంగా ఆమె ఉత్త‌రాదిన చేస్తున్న సినిమా కోసం అక్క‌డివారు కూడా ఎదురుచూస్తున్నారు. అలాగే ఫస్ట్ టైమ్ వెండితెర‌మీద షారుఖ్ ఖాన్‌, న‌య‌న‌తార‌ క‌లిసి న‌టిస్తున్నారు. వారిద్ద‌రి మ‌ధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూడ‌టానికి వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు మూవీగోయ‌ర్స్. ఇటీవల వచ్చిన జ‌వాన్ ప్రివ్యూలో న‌య‌న‌తార‌ను చూసిన వారు వావ్ అంటున్నారు. హై ఆక్టేన్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ఆమె పాత్ర డిజైన్ అయిన తీరుకు ఫిదా అవుతున్నారు. పోస్ట‌ర్‌ని చూస్తుంటే నెక్స్ట్ లెవ‌ల్ మూవీ రెడీ అవుతోంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. న‌య‌న‌తార ఈ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించనున్నారు. మొత్తంగా ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్ ప్రేక్షకులకు మజానిస్తున్నాయి. ఈ తరుణంలో నెక్స్ట్ అప్‌డేట్ ఏం ఇస్తారా? అని ప్రేక్ష‌కులు వెయిట్ చేసేలా క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ (Red Chillies Entertainment) పతాకంపై అట్లీ (Atlee) ద‌ర్శ‌క‌త్వంలో గౌరీఖాన్ (Gauri Khan) ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గౌర‌వ్‌వ‌ర్మ స‌హ నిర్మాత‌. ‘జ‌వాన్’ మూవీని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7న హిందీ, తెలుగు, త‌మిళ్‌లో భాషల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Hidimbha Reverse Trailer: టాలీవుడ్‌లో తొలిసారి సరికొత్త ప్రయోగం

**************************************

*NTR and Krishna: రెండు చిత్రాలు.. కథ మాత్రం ఒక్కటే.. అప్పట్లోనే ఇలా జరిగిందనే విషయం తెలుసా?

**************************************

*Saindhav: గాయత్రిగా సారా.. లుక్ విడుదల

**************************************

*Ketika Sharma: ‘బ్రో’ సినిమాకు ఆయన పేరు చాలు

**************************************

*Nidhhi Agerwal: పవర్‌స్టార్‌కి థ్యాంక్స్ చెప్పిన నిధి.. పోస్ట్ వైరల్

**************************************

*SSMB29: మహేష్ కుమార్తె, ఎన్టీఆర్ కుమారుడు.. ఇరు హీరోల ఫ్యాన్స్‌కి ట్రీటే ట్రీటు!

**************************************

Updated Date - 2023-07-18T13:15:10+05:30 IST