సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

ABN, First Publish Date - 2023-03-23T20:04:10+05:30

మనం ఏదైనా చెబితే విననట్టే ఉంటారు. కానీ మనం ఆ సీన్‌ చెప్పిన మరుక్షణం నుంచి ఆయన అందులో పరకాయప్రవేశం చేసేసి, దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్‌ను తనలోని నటుడి దగ్గరకు

Director and Writer Trivikram Srinivas
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2023 నూతన తెలుగు సంవత్సరం ఉగాది (శోభకృత్‌నామ సంవత్సరం)ని పురస్కరించుకుని (Ugadi) ఫిలిం నగర్‌లోని (Film Nagar) ఫిలిం నగర్‌ కల్చరల్‌ క్లబ్‌ (Film Nagar Cultural Club) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎఫ్‌.ఎన్‌.సి.సి (FNCC) స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హాస్యబ్రహ్మ డా. బ్రహ్మానందం (Dr. Brahmanandam)ని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ (Talasani Srinivas Yadav), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం జీవితానికి సంబంధించి పలు వివరాలతో కూడిన ఏవీని ప్రదర్శించారు. పద్మశ్రీ, గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ గ్రహీత, డాక్టర్‌ బ్రహ్మానందంని శాలువా, గజమాలతో సత్కరించి, ఆయనకు కలియుగదైవం వేంకటేశ్వరుని ప్రతిమ, సన్మానపత్రం అందజేశారు. నటుడు ఉత్తేజ్‌.. బ్రహ్మానందం సన్మానం కోసం తాను రాసిన అద్భుతమైన సన్మాన పత్రం చదివి వినిపించారు.

అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా బ్రహ్మానందంగారితో పర్సనల్‌గా గడిపే సమయం దొరకడం నిజంగా నా అదృష్టం. ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు.. ఆయన కూడా ఎప్పుడూ నవ్వుతూనే బతుకుతుంటారు. నవ్వు ఆయన జీవన విధానం అయిపోయింది. మనం ఏదైనా చెబితే విననట్టే ఉంటారు. కానీ మనం ఆ సీన్‌ చెప్పిన మరుక్షణం నుంచి ఆయన అందులో పరకాయప్రవేశం చేసేసి, దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్‌ను తనలోని నటుడి దగ్గరకు లాక్కుంటారు. మనకు భౌతికంగా కనిపించే బ్రహ్మానందం వేరు.. మానసికంగా శిఖరాగ్రానికి చేరిన బ్రహ్మానందం వేరు. చాలా లోతైన వ్యక్తి. ఎంతో విజ్ఞానం ఉన్న వ్యక్తి.. మానసికంగా ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి ఈ కమెడియన్‌ పాత్రను పోషిస్తున్నారు. చాలా ఆధ్యాత్మికత, అంతే వాస్తవికతల మధ్యలో ఉండే సంఘర్షణలో బతికే మేధావి బ్రహ్మానందంగారు. రంగమార్తాండలో ఆయన పాత్రే.. ఆయన నిజజీవితం. మనందరి నవ్వులు ఒక్క సంవత్సరం కింద లెక్కేస్తే.. కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతాయి. ఆయన అన్ని సంవత్సరాలూ జీవించాలని, మనల్ని నవ్విస్తూనే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. (Trivikram Srinivas About Brahmanandam)

ఇవి కూడా చదవండి:

*********************************

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Kantara 2: కీలక అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*RRR Naatu Naatu: అమెరికాలో టెస్లా కార్ లైట్ షో.. దర్శకధీరుడు ఫిదా..

*NBK108: బాలయ్య సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే.. సెట్ వీడియో వైరల్

*Hema: కోట శ్రీనివాసరావు మృతి అనే వార్తలపై హేమ ఫైర్.. ఫైనల్‌గా ఏం చేసిందంటే?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-23T20:04:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!