Tamannaah: బాబోయ్.. ఆ వెబ్ సిరీస్‌లలో ఏముంది.. ఈ పాటలో తమన్నాని చూస్తే అస్సలు తట్టుకోలేరు

ABN , First Publish Date - 2023-07-06T23:19:25+05:30 IST

సూపర్ స్టార్ రజనీకాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జైలర్’. ఈ సినిమా నుంచి తాజాగా ‘కావాలా’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో తమన్నా వేసిన స్టెప్స్ మరోసారి ఆమెను వార్తలలో నిలబెడుతున్నాయి. ఈ మధ్య ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ విషయంలో తమన్నా పేరు వైరల్ అయిన విషయం తెలిసిందే.

Tamannaah: బాబోయ్.. ఆ వెబ్ సిరీస్‌లలో ఏముంది.. ఈ పాటలో తమన్నాని చూస్తే అస్సలు తట్టుకోలేరు
Tamannaah in Jailer

ఈ మధ్య తమన్నా (Tamannaah)పై వార్తలు ఏ విధంగా వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. ముఖ్యంగా ఆమె ‘జీ కర్దా’ (jee karda), ‘లస్ట్ స్టోరీస్ 2’ (Lust Stories season 2) వెబ్ సిరీస్‌లలో బోల్డ్ సీన్స్ చేయడంపై భారీగా ట్రోలింగ్ జరిగింది. ఆమెని అభిమానించే వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నటిగా అన్ని పాత్రలు చేయాలి కానీ.. మరీ ఇలాంటి సీన్స్ ఈ టైమ్‌లో నీకెందుకు? అనేలా ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేశారు. అయితే ఆ ట్రోలింగ్‌కు తమన్నా కూడా సరిగ్గా సమాధానం ఇస్తూనే వస్తుంది. అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా.. ట్రోలింగ్‌ని కేర్ చేయలేదు. ఇంకా తన బాయ్‌ఫ్రెండ్‌కు సంబంధించి కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. అయితే ఆమెపై కాస్త ట్రోలింగ్ తగ్గుముఖం పట్టింది కదా.. అనుకుంటున్న సమయంలో.. తాజాగా ఆమె నటిస్తోన్న ‘జైలర్’ (Jailer) సినిమా నుంచి ఓ లిరికల్ సాంగ్ వచ్చింది.

Tamanna-2.jpg

నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dileep Kumar) దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్ (Super Star Rajinikanth) హీరోగా నటిస్తున్న చిత్రం ‘జైలర్‌’. ఇందులో తమన్నా (Tamannaah) హీరోయిన్‌గా నటించింది. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మాత కళానిధి మారన్‌ నిర్మించారు. రమ్యకృష్ణ, తమన్నా, శివరాజ్‌ కుమార్‌, సునీల్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోన్న నేపథ్యంలో.. మేకర్స్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. అందులో భాగంగా గురువారం చిత్రంలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.

Tamanna.jpg

‘కావాలా’ అనే లిరిక్స్‌తో (Kaavaalaa Lyrical Song) మాంచి మసాలా బీట్‌తో అనిరుధ్ ఈ సాంగ్‌ని కంపోజ్ చేశారు. ఈ పాటలో తమన్నా స్టెప్స్ చూస్తుంటే.. పైన ఆమె బోల్డ్ సీన్స్‌లో నటించిన వెబ్ సిరీస్‌లు కూడా సరిపోవు అన్నట్లుగా ఉంది. గతంలో ‘స్వింగ్ జర స్వింగ్ జర’కు ఎలా అయితే నడుమును ఆడించిందో.. ఇప్పుడు వచ్చిన ‘కావాలా’ సాంగ్‌లో కూడా అంతకుమించి అనేలా అదిరిపోయేలా స్టెప్స్ వేసింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో తమన్నా వేసిన స్టెప్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి ట్రెండింగ్‌లో టాప్ పొజిషన్‌లో ఉండటం విశేషం. మొత్తంగా ఈ పాటతో మరోసారి తమన్నా వార్తలలో హైలెట్ అవుతోంది. మరి లిరికల్ సాంగ్‌లో చూపించిన రెండు స్టెప్స్‌కే.. ఒక రేంజ్‌లో వార్తలు వైరల్ అవుతుంటే.. రేపు థియేటర్లలో జనాలు ఊగిపోవడం ఖాయం అనేలా అప్పుడే టాక్ కూడా మొదలైంది. (Tamannaah in Jailer Song)


ఇవి కూడా చదవండి:

**************************************

*Vijayashanthi: నా దూకుడు, పోరాటం వెనుక ఉండేది ఎప్పుడూ వారే..

**************************************

*Jagapathi Babu: అప్పుడు ‘లెజెండ్’.. ఇప్పుడు ‘రుద్రంగి’.. వైల్డ్ క్యారెక్టర్‌తో వస్తున్నా..

**************************************

*Mrunal Thakur: ఫస్ట్ క్రష్, డిప్రెషన్.. మృణాల్‌ ఠాకూర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

*Thangalaan: విక్రమ్ ‘తంగలాన్‌’ ఎంత వరకు వచ్చిందంటే..

**************************************

*Lavanya Tripathi: పెళ్లి కళ వచ్చేసింది.. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూశారా!

**************************************

*Nikhil: ఇక ఆ తప్పు జరగనివ్వను.. సారీ చెప్పిన హీరో నిఖిల్

**************************************

*Pawan Kalyan: మళ్లీ విడాకులు అంటున్న వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం

**************************************

Updated Date - 2023-07-06T23:19:25+05:30 IST