Jagapathi Babu: అప్పుడు ‘లెజెండ్’.. ఇప్పుడు ‘రుద్రంగి’.. వైల్డ్ క్యారెక్టర్‌తో వస్తున్నా..

ABN , First Publish Date - 2023-07-06T21:43:42+05:30 IST

విలక్షణ నటుడు జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమత మోహన్ దాస్, విమలా రామన్‌ కీలక పాత్రలలో నటించారు. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రం జులై 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ‘లెజెండ్’ సెకండ్ ఇన్నింగ్స్ అయితే.. ‘రుద్రంగి’ థర్డ్ ఇన్నింగ్స్ అని జగపతిబాబు అన్నారు.

Jagapathi Babu: అప్పుడు ‘లెజెండ్’.. ఇప్పుడు ‘రుద్రంగి’.. వైల్డ్ క్యారెక్టర్‌తో వస్తున్నా..
Jagapathi Babu in Rudrangi Movie

విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంగి’ (Rudrangi). అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమత మోహన్ దాస్ (Mamta Mohan Das), విమలా రామన్‌ (Vimala Raman) కీలక పాత్రలలో నటించారు. రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan) నిర్మించిన ఈ చిత్రం జులై 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు జగపతిబాబు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

‘‘ఈ ‘రుద్రంగి’ సినిమాను ఎంతో ప్యాషన్‌తో చేశాను. డైరెక్టర్ కథ చెప్పిన విధానం.. కాన్ఫిడెంట్ నాకు బాగా నచ్చింది. మనసులో ఓకే అనుకున్నా. కానీ కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ చేయగలరా అని అనుకున్నా. చేయలా వద్దా అని చాలా డౌట్‌ పడ్డాను. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువగా ఉన్న మూవీ. నేను అనుకున్నదాని కంటే ఎక్కువ అయింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్‌లో అజయ్ తీశాడు. క్యాస్టింగ్ కూడా దొర, దొరసానిల లుక్‌ కూడా వేరుగా ఉంది. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. పెద్ద బడ్జెట్ అనే పాయింట్ ఇవాళ దాటిపోయింది. డబ్బులు పెడితే సూపర్ హిట్ అనేది కాదు. రీసెంట్‌గా ‘సామజవరగమన’ మూవీని చూశాం. (Jagapathi Babu about Rudrangi)

Jaggu-Bhai.jpg

‘రుద్రంగి’ సినిమా పోరాటానికి సంబంధించినది కాదు. వయలెంట్ ఫ్యామిలీ డ్రామా. మహిళల మధ్యన.. భర్తల మధ్యన.. భార్యల లవర్స్ మధ్యన ఎలా జరుగుతుందనేది కథ. కొత్తగా ఉంటుంది. సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఈ సినిమాలో విలన్‌ అని కూడా చెప్పలేను. కానీ ఈ విలన్ కూడా నచ్చుతాడని అనుకుంటున్నా. నాది వైల్డ్ క్యారెక్టర్. ఆ రోజుల్లో ఆ దొరలు.. ఆ బానిసలు ఎలా ఉంటారనేది ఉంటుంది. మూడేళ్లు సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు ‘లెజెండ్’ (Legend) అవకాశం వచ్చింది. బోయపాటి శ్రీను (Boyapati Srinu) సాలీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. బాలయ్య (Balayya) నాయకుడు ఎవరు..? ప్రతి నాయకుడు ఎవరు అని పట్టించుకోరు. ఆయన కాన్ఫిడెంట్‌తో వెళ్లిపోతుంటారు. ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అది అందరూ సెకెండ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టారు. ఈ మూవీతో నేను థర్డ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టుకుంటున్నా. క్యారెక్టర్‌లో దమ్ము ఉంటుంది. కచ్చితంగా మాట్లాడుకోవాలి. మంచి ఆకలి మీద ఉన్నప్పుడు.. మంచి పాత్ర చేయాలన్నప్పుడు ‘రుద్రంగి’ వచ్చింది. నా విశ్వరూపం చూస్తారు. ఈ సినిమా అందరికీ ఉత్సాహాన్నిచ్చింది. మా అందరికీ ఈ సినిమాలోని ఆత్మ కనెక్ట్ అయింది..’’ అని జగ్గు భాయ్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Mrunal Thakur: ఫస్ట్ క్రష్, డిప్రెషన్.. మృణాల్‌ ఠాకూర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

*Thangalaan: విక్రమ్ ‘తంగలాన్‌’ ఎంత వరకు వచ్చిందంటే..

**************************************

*Lavanya Tripathi: పెళ్లి కళ వచ్చేసింది.. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూశారా!

**************************************

*Nikhil: ఇక ఆ తప్పు జరగనివ్వను.. సారీ చెప్పిన హీరో నిఖిల్

**************************************

*Pawan Kalyan: మళ్లీ విడాకులు అంటున్న వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం

**************************************

*NKR21: మరో యంగ్ దర్శకుడితో.. యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో.. కళ్యాణ్ రామ్ స్పీడ్ చూశారా!

**************************************

Updated Date - 2023-07-06T21:46:12+05:30 IST