Lavanya Tripathi: పెళ్లి కళ వచ్చేసింది.. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూశారా!

ABN , First Publish Date - 2023-07-05T22:41:30+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠిల మధ్య ప్రేమ చిగురించినట్లుగా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నా.. ఎప్పుడూ వారిద్దరూ స్పందించలేదు. తీరా చూస్తే.. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా అయిపోయింది. అప్పటి నుంచి లావణ్య త్రిపాఠిపై సోషల్ మీడియాలో ఏదో రకంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమె కొన్ని ఫొటోలను షేర్ చేయగా.. అంతా ఆమెకు పెళ్లి కళ వచ్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Lavanya Tripathi: పెళ్లి కళ వచ్చేసింది.. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూశారా!
Heroine Lavanya Tripathi

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ల మధ్య ప్రేమ చిగురించినట్లుగా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నా.. ఎప్పుడూ వారిద్దరూ స్పందించలేదు. తీరా చూస్తే.. ఇద్దరికీ నిశ్చితార్థం (Engagement) కూడా అయిపోయింది. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు కానీ.. వరుణ్, లావణ్యలు (Varun Tej and Lavanya Tripathi) మాత్రం పెళ్లి కోసం ఎంతగానో వేచి చూస్తున్నట్లుగా అయితే అర్థమవుతోంది. వరుణ్ తేజ్ ఏమోగానీ.. లావణ్య త్రిపాఠిలో మాత్రం రోజురోజుకూ పెళ్లి కళ ఉట్టిపడుతోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలను చూసిన వారంతా.. చెబుతున్న మాట ఏమిటంటే.. ‘లావణ్యకు పెళ్లి కళ వచ్చేసింది’.

Lavanya-2.jpg

నిజమే ఆ నిండైన చీరకట్టులో లావణ్యను (Lavanya Tripathi in Saree) చూస్తుంటే.. నిజంగానే పెళ్లి కళ కొట్టిచ్చినట్లు కనబడుతోంది. మెగా ప్రిన్స్‌తో నిశ్చితార్థం అనంతరం లావణ్య‌కు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా.. వైరల్ అవుతోంది. మెగా చిన్నకోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టే క్షణం కోసం.. వేచి చూస్తున్నట్లుగా ఆ ఫొటోలలో ఆమె ఫోజులున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

Lavanya-4.jpg

పెళ్లి అనంతరం లావణ్య త్రిపాఠి నటిగా కొనసాగక పోవచ్చు.. ఈ విషయంపై కూడా నిశ్చితార్థానికి ముందే చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. కానీ ఆమెకు ఎంతో ఇష్టమైన శాస్త్రీయ సంగీతాన్ని మాత్రం వదలకుండా కంటిన్యూ చేసేలా.. లావణ్య షరతు (Condition) పెట్టినట్లుగా తెలుస్తుంది కాబట్టి.. సోషల్ మీడియాకు ఆమె దూరం అయ్యే అవకాశం అయితే లేదు. ఆ విధంగా ఆమె అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.

Lavanya-3.jpg

ఇక లావణ్య పోస్ట్ చేసిన తాజా ఫొటోల విషయానికి వస్తే.. వైట్ కలర్ శారీ (White Colour Saree) ధరించిన ఆమె ఆ కలర్ చాలా పవర్ ఫుల్ అని పేర్కొంది. అంతే కాదు.. ఈ శారీలో ఎంగేజ్‌మెంట్ రింగ్ (Engagement Ring) కనబడేలా ఆమె ఇచ్చిన ఫోజులకు అంతా ఫిదా అవుతున్నారు.

Lavanya-5.jpg

అందుకే లావణ్యకు పెళ్లి కళ వచ్చేసిందంటూ, ఎంగేజ్‌మెంట్ తర్వాత ఆమెలో భారీగా మార్పు కనిపిస్తుందంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. త్వరలోనే వరుణ్, లావణ్యల వెడ్డింగ్ డేట్ (Varun Tej and Lavanya Tripathi Wedding Date) అనౌన్స్‌మెంట్ రానుందనేలా టాక్ వినబడుతోంది.

Lavanya-1.jpg

ఇవి కూడా చదవండి:

**************************************

*Nikhil: ఇక ఆ తప్పు జరగనివ్వను.. సారీ చెప్పిన హీరో నిఖిల్

**************************************

*Pawan Kalyan: మళ్లీ విడాకులు అంటున్న వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం

**************************************

*NKR21: మరో యంగ్ దర్శకుడితో.. యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో.. కళ్యాణ్ రామ్ స్పీడ్ చూశారా!

**************************************

*Devil Glimpse: గూఢచారి‌కి ఉండాల్సిన ముఖ్యలక్షణం ఏమిటో.. కళ్యాణ్ రామ్ మాటల్లో..!

**************************************

*Sekhar Chandra: ఆ పాటకి 3 కోట్ల వ్యూస్.. ఆనందంలో సంగీత దర్శకుడు

**************************************

*Tejaswini Pandit: తినటానికి తిండి లేక.. ‘ఆదిపురుష్’ శూర్పణఖ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

Updated Date - 2023-07-05T22:41:30+05:30 IST