Pawan Kalyan: మళ్లీ విడాకులు అంటున్న వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం

ABN , First Publish Date - 2023-07-05T19:11:10+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకి కూడా విడాకులు ఇచ్చారని, కొన్ని రోజులుగా వారు విడివిడిగా ఉంటున్నారంటూ.. ఓ వర్గపు మీడియా చేస్తున్న రూమర్స్‌కి, రాస్తున్న రాతలకి.. జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా చెప్పుతో కొట్టినట్లుగా పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. వారిద్దరూ కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోని షేర్ చేసి.. వినిపిస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చారు.

Pawan Kalyan: మళ్లీ విడాకులు అంటున్న వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం
Pawan Kalyan and Anna Lezhneva

మెగా ఫ్యామిలీలో నిహారిక (Niharika), చైతన్య (Chaitanya) దంపతులకు మధ్య కొంతకాలంగా సఖ్యత కుదరకపోవడంతో.. వారు డైవర్స్‌కి అప్లయ్ చేయడం, కోర్టు వారికి విడాకులు మంజూరు చేసినట్లుగా కొన్ని పేపర్లు మీడియా సర్కిల్స్‌లో వైరల్ అవడం తెలిసిందే. నిహారిక కూడా.. ఈ విడాకులపై క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేసింది. అయితే కొంత మంది.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా తన మూడో భార్యకు విడాకులు ఇస్తున్నట్లుగానూ, ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లో లేదనేలా కొన్ని వదంతులను పుట్టించారు. ఈ వార్తలను ఓ రాజకీయ పార్టీ ‘ప్యాకేజ్’ ఇచ్చి మరీ నేషనల్ మీడియాలో ప్రచారం చేయించినట్లుగా వార్తలు వినబడుతోన్న నేపథ్యంతో.. అలాంటి వారందరికీ చెప్పుతో కొట్టినట్లుగా జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ సమాధానమిచ్చింది.

‘‘జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల (Anna Lezhneva) - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్‌లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను పవన్ కళ్యాణ్, అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరి చేరుకుంటారు..’’ అని తెలుపుతూ పవన్ కళ్యాణ్, అనా కలిసి పూజలు నిర్వహిస్తున్న ఫొటోని జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు.

Pawan.jpg

దీంతో.. కావాలని కొందరు చేస్తున్న రూమర్స్‌కి బ్రేక్ వేసినట్లయింది. అలాగే.. నేషనల్ మీడియా ప్రచారం చూసి.. నిజమేనేమో అని కొందరు రాస్తున్న రాతలకు క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇది పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే.. చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం అంటూ.. మెగా ఫ్యాన్స్, జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ద్వారా వచ్చిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*NKR21: మరో యంగ్ దర్శకుడితో.. యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో.. కళ్యాణ్ రామ్ స్పీడ్ చూశారా!

**************************************

*Devil Glimpse: గూఢచారి‌కి ఉండాల్సిన ముఖ్యలక్షణం ఏమిటో.. కళ్యాణ్ రామ్ మాటల్లో..!

**************************************

*Sekhar Chandra: ఆ పాటకి 3 కోట్ల వ్యూస్.. ఆనందంలో సంగీత దర్శకుడు

**************************************

*Tejaswini Pandit: తినటానికి తిండి లేక.. ‘ఆదిపురుష్’ శూర్పణఖ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

Updated Date - 2023-07-05T19:34:19+05:30 IST