Nikhil: ఇక ఆ తప్పు జరగనివ్వను.. సారీ చెప్పిన హీరో నిఖిల్

ABN , First Publish Date - 2023-07-05T20:54:47+05:30 IST

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ సోషల్ మీడియా వేదికగా అందరినీ క్షమాపణలు కోరారు. ‘స్పై’ సినిమా కాంట్రాక్ట్ మరియు కంటెంట్ సమస్యలతో.. సినిమాని అనుకున్న విధంగా విడుదల చేయలేకపోయామని, పాన్ ఇండియా అని చెప్పి అన్ని భాషలలో విడుదల చేయలేకపోయామని.. ఈ సందర్భంగా సినీ లవర్స్ అందరినీ క్షమాపణలు కోరుతున్నట్లుగా నిఖిల్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.

Nikhil: ఇక ఆ తప్పు జరగనివ్వను.. సారీ చెప్పిన హీరో నిఖిల్
Hero Nikhil Siddhartha

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) సోషల్ మీడియా వేదికగా అందరినీ క్షమాపణలు కోరారు. ఆయన ఏం తప్పు చేశాడని క్షమాపణలు కోరారని అనుకుంటున్నారేమో.. చెప్పిన టైమ్‌కి, చెప్పిన విధంగా సినిమా అందించలేకపోవడం.. ఆయన దృష్టిలో తప్పే. అందుకే క్షమాపణలు కోరుతూ.. ఇకపై అలాంటి తప్పు జరగనివ్వనని సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ (Letter)ను విడుదల చేశారు. నిఖిల్ హీరోగా రీసెంట్‌గా వచ్చిన చిత్రం ‘స్పై’ (Spy Movie). ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్నప్పటికీ.. కలెక్షన్స్ పరంగా మాత్రం హిట్ దిశగానే నడుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా (Pan India) సినిమాగా విడుదల చేస్తున్నట్లుగా మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ.. చెప్పినట్లుగా పాన్ ఇండియా వైడ్‌గా వారు చెప్పిన భాషలలో ఈ సినిమా విడుదల కాలేదు. దీంతో ఆయన సినీ లవర్స్‌ని (Cinema Loving Audience) క్షమాపణలు కోరారు.

నిఖిల్ విడుదల చేసిన లేఖలో ఏముందంటే.. (Nikhil Letter)

‘‘హలో.. స్పై సినిమాకి నా కెరియర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌‌కు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాపై మీరంతా ఇంతగా నమ్మకం ఉంచినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే.. కాంట్రాక్ట్ మరియు కంటెంట్ ఆలస్యం అవడంతో.. ఈ సినిమాని దేశవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదల చేయలేకపోయాం. ఇది నన్ను ఎంతగానో బాధించింది. ఆ సమస్యతోనే.. ఓవర్సీస్‌లోనూ సుమారు 350 తెలుగు ప్రీమియర్ షోలు రద్దయ్యాయి. అందుకే హిందీ, కన్నడ, తమిళ మరియు మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తూ.. ఒక ప్రామిస్ కూడా చేస్తున్నాను. ‘కార్తికేయ 2’ సినిమా తర్వాత.. రాబోయే నా మూడు సినిమాలు అన్ని భాషలలోనూ థియేటర్స్‌లో అనుకున్న సమయానికి విడుదల అయ్యేలా చూస్తానని మాటిస్తున్నాను. అలాగే నాపై నమ్మకం ఉంచిన ప్రతి తెలుగు సినీ ప్రేమికుడికి కూడా మాటిస్తున్నాను. ఇకపై నాణ్యత విషయంలో అస్సలు రాజీపడను. దీనికి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా సరే.. తలొగ్గకుండా.. అంతా పూర్తి చేసి, చెక్ చేసి.. మంచి క్వాలిటీ ఉన్న సినిమాను మీకు అందిస్తాను.. లాట్స్ ఆప్ లవ్ అండ్ రెస్పెక్ట్‌తో మీ నిఖిల్’’ అంటూ నిఖిల్ తన లేఖలో పేర్కొన్నారు. (Spy Movie)

Nikhil-Siddhartha.jpg

దీనికి నెటిజన్లు కూడా థ్యాంక్స్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘నిఖిల్ సినిమాలంటే స్క్రిప్ట్స్ చాలా బాగుంటాయనే నమ్మకం ఉంది బ్రదర్.. దయచేసి కాంప్రమైజ్ కావద్దు’, ‘ అన్నా.. యంగ్ హీరోల బ్యాచ్‌లో మీపై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.. మీకొచ్చిన పేరుని క్యాష్ చేసుకునే నిర్మాతలను కాకుండా.. ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్‌ని చూసుకుని సినిమాలు చేయండి’.. అంటూ నెటిజన్లు నిఖిల్‌ లేఖపై కామెంట్స్ చేస్తున్నారు. (Nikhil Movie Spy)


ఇవి కూడా చదవండి:

**************************************

*Pawan Kalyan: మళ్లీ విడాకులు అంటున్న వారికి చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం

**************************************

*NKR21: మరో యంగ్ దర్శకుడితో.. యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో.. కళ్యాణ్ రామ్ స్పీడ్ చూశారా!

**************************************

*Devil Glimpse: గూఢచారి‌కి ఉండాల్సిన ముఖ్యలక్షణం ఏమిటో.. కళ్యాణ్ రామ్ మాటల్లో..!

**************************************

*Sekhar Chandra: ఆ పాటకి 3 కోట్ల వ్యూస్.. ఆనందంలో సంగీత దర్శకుడు

**************************************

*Tejaswini Pandit: తినటానికి తిండి లేక.. ‘ఆదిపురుష్’ శూర్పణఖ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

Updated Date - 2023-07-05T20:54:47+05:30 IST