Salaar: రెబల్ స్టార్ ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. షారుఖ్‌కి ఝలక్!

ABN , First Publish Date - 2023-09-25T23:02:45+05:30 IST

ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదల విషయంలో ఫ్యాన్స్ ఎంత నిరాశగా ఉన్నారో తెలియంది కాదు. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.

Salaar: రెబల్ స్టార్ ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. షారుఖ్‌కి ఝలక్!
Prabhas in Salaar Movie

రెబల్ స్టార్ ప్రభాస్‌ (Rebel Star Prabhas) నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’ (Salaar). ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం విడుదల విషయంలో ఫ్యాన్స్ ఎంత నిరాశగా ఉన్నారో తెలియంది కాదు. వాస్తవానికి అన్నీ బాగుండి ఉంటే.. ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ చివరి నిమిషంలో విఎఫ్‌ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని దర్శకుడు భావించడంతో.. సినిమాని వాయిదా వేయక తప్పలేదు. ప్రస్తుతం కొన్ని సీన్లను రీ షూట్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే సినిమా వాయిదా అని అన్నారు కానీ.. మళ్లీ విడుదల తేదీ విషయంలో మేకర్స్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ ఫిక్సయినట్లుగా బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

*Salaar Release Date: అందరూ ఎదురుచూస్తున్న ప్రభాస్ సినిమా విడుదల అప్పుడేనా... (ముందే చెప్పిన చిత్రజ్యోతి)


ఆయన ట్వీట్‌లో చెప్పిన ప్రకారం ఈ సినిమా క్రిస్మస్ (Christmas) కానుకగా.. 22 డిసెంబర్ 2023న విడుదల కాబోతోందని తెలుస్తోంది. అయితే అదే రోజు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ (SRK) నటించిన ‘డుంకీ’ (Dunki) విడుదల కూడా ఉండటంతో.. మరోసారి ‘సలార్’ విడుదలపై కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే మేకర్స్ మాత్రం.. ఇప్పుడు వినిపిస్తున్న డేట్‌కి ‘సలార్’ని థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్సయ్యారని తెలుస్తోంది. అదే జరిగితే.. ప్రశాంత్ నీల్ చిత్రం.. షారుఖ్ చిత్రానికి పోటీ పడటం ఇదే రెండోసారి అవుతుంది. అంతకు ముందు అంటే 2018లో ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్’ (KGF), షారుఖ్ ‘జీరో’ (Zero) చిత్రాలు డిసెంబర్‌లో పోటీ పడ్డాయి. ఇప్పుడు మళ్లీ వారి మధ్య ఆసక్తికర పోటీ నెలకొనే అవకాశాలే కనిపిస్తున్నాయి. వాస్తవానికి షారుఖ్ ‘డుంకీ’ చిత్ర విడుదల తేదీని ఎప్పుడో ఫిక్స్ చేశారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే డేట్ అంటే.. కొంత క్లాష్ ఏర్పడే అవకాశాలు అయితే లేకపోలేదు. చూద్దాం ఏం జరుగుతుందో..


Dunki.jpg

‘సలార్’ విషయానికి వస్తే.. ప్రభాస్‌, శృతి హాసన్‌ (Shruti Haasan) జంటగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్‌ (Hombale Films) పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ‘సలార్’ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘కె.జి.ఎఫ్‌.’ సిరీస్ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ - హోంబలే సంస్థ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకుని ఉన్నారు. అయితే మేకర్స్ మాత్రం ఇంకా ‘సలార్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. సెప్టెంబర్ 29న విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని తరణ్ ఆదర్శ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. (Salaar Release Date)

Salaar-2.jpg


ఇవి కూడా చదవండి:

============================

*Nayanthara: నయనతార అసలు పేరు.. నటి కాకముందు ఆమె ఏం చేసేదో తెలుసా? వీడియో వైరల్

**************************************

*Thee Ivan: పెళ్ళికి ముందే వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి సందేశమిచ్చే చిత్రమిది

**************************************

*Janam: రాజకీయ నాయకులతో పాటు జ‌నానికి కూడా చురకలు వేస్తున్నారట..

****************************************

*P Vasu: మా గాడ్ ఫాదర్ ఎన్టీఆరే..

****************************************

*Rambha: ప్లీజ్ ప్లీజ్ స్వామి.. అంటూ దేవుడ్ని ఏం వేడుకుందో చూశారా? వీడియో వైరల్!

****************************************

Updated Date - 2023-09-26T17:30:23+05:30 IST