Nayanthara: నయనతార అసలు పేరు.. నటి కాకముందు ఆమె ఏం చేసేదో తెలుసా? వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-09-25T22:28:55+05:30 IST

నయనతార.. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్‌గా దూసుకుపోతున్న ఈ భామ అసలు పేరు ఏంటో?.. అలాగే నటి కాకముందు ఆమె ఏం చేసేదో తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. తాజాగా సోషల్ మీడియాలో నయనతారకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె బుల్లితెర యాంకర్‌గా దర్శనమిస్తున్నారు. అలాగే ఆమె అసలు పేరుపై కూడా ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి.

Nayanthara: నయనతార అసలు పేరు.. నటి కాకముందు ఆమె ఏం చేసేదో తెలుసా? వీడియో వైరల్
Nayanthara

నయనతార (Nayanthara).. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్‌ (Lady Super Star)గా దూసుకుపోతున్న ఈ భామ అసలు పేరు ఏంటో?.. అలాగే నటి కాకముందు ఆమె ఏం చేసేదో తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఈ లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు డేట్స్ ఇస్తే చాలు అనుకునే స్టార్ స్టేటస్‌ని సంపాదించుకున్నా.. కెరీర్ ప్రారంభంలో మాత్రం సెకండ్ హీరోయిన్ రోల్స్ కూడా చేసింది. చాలా కష్టపడింది. అప్పుడు కష్టపడింది కాబట్టే.. ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తుంది. గ్లామర్ హీరోయిన్ నుంచి.. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే స్థాయికి చేరింది. అలాగే కోలీవుడ్ దర్శకుడిని పెళ్లాడిన ఈ కేరళ బ్యూటీ.. ఇటీవల కవల పిల్లలకు తల్లిగా మారింది. అయినా కూడా సినిమాలు మాత్రం చేస్తూనే ఉంది. రీసెంట్‌గా ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘జవాన్’ సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న నయనతార.. ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు సైన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సరే.. విషయంలోకి వస్తే..

డయానా నుంచి నయనతారగా..

నయనతార అసలు పేరు డయానా (Dayana). కెరీర్ మొదట్లో ఆమె.. తన మాతృభాషలో ‘మనసీనక్కరే’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాలో సీనియర్ నటి షీలా ముఖ్యపాత్రను పోషించగా.. సత్యన్ దర్శకుడు. అయితే దర్శకుడికి డయానా అనే పేరు నచ్చలేదు. అందుకోసం ప్రత్యేకంగా ఒక రోజంతా ఆలోచించి ఆమె పేరును మార్చే కార్యక్రమం పెట్టుకున్నాడట. అలా ఆలోచించి ఆలోచించి.. నటి షీలా ద్వారా డయానా పేరును నయనతారగా మార్చారట. అలా డయానా కాస్త నయనతారగా మారింది. ఆమె పేరు చివర ఉన్న ‘తార’ (Star) లాగే.. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా.. వరుస అవకాశాలతో దాదాపు అన్ని ఇండస్ట్రీలలో ఆధిపత్యాన్ని చాటింది.


Nayan.jpg

నటి కాకముందు డయానా ఏం చేసేదంటే..

నటి కాకముందు డయానా అలియాస్ నయనతార (Dayana alias Nayanthara) యాంకర్‌గా వర్క్ చేసేంది. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి ఆమె యాంకర్‌ (Anchor)గా పనిచేసేంది. ప్రస్తుతం ఆమె యాంకర్‌గా చేసినప్పటి వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. దీంతో.. నయనతార అసలు పేరు, నటి కాక ముందు ఆమె ఏం చేసేదో చూశారా అంటూ.. వార్తలు దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోలో యాంకర్‌గానే నయనతార మెప్పిస్తుంది. ‘గజనీ’ (Gajini) సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన నయనతారకు.. రజనీకాంత్ (Rajinikanth) సరసన చేసిన ‘చంద్రముఖి’ (Chandramukhi)తో తిరుగులేని స్టార్‌‌డమ్ వశమైంది. అంతే.. అక్కడి నుంచి నయనతార వేసిన అడుగులు అందరికీ తెలిసినవే.


ఇవి కూడా చదవండి:

============================

*Thee Ivan: పెళ్ళికి ముందే వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి సందేశమిచ్చే చిత్రమిది

**************************************

*Janam: రాజకీయ నాయకులతో పాటు జ‌నానికి కూడా చురకలు వేస్తున్నారట..

****************************************

*P Vasu: మా గాడ్ ఫాదర్ ఎన్టీఆరే..

****************************************

*Rambha: ప్లీజ్ ప్లీజ్ స్వామి.. అంటూ దేవుడ్ని ఏం వేడుకుందో చూశారా? వీడియో వైరల్!

****************************************

*Manchu Lakshmi: నా కష్టం.. నా సంపాదన.. నీకేమిరా నొప్పి?.. మంచు లక్ష్మీ ఫైర్!

*****************************************

Updated Date - 2023-09-25T22:28:55+05:30 IST