Thee Ivan: పెళ్ళికి ముందే వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి సందేశమిచ్చే చిత్రమిది

ABN , First Publish Date - 2023-09-25T21:02:18+05:30 IST

ఒక కుటుంబంలో యువతీ లేదా యువకుడు.. సంస్కృతి సంప్రదాయానికి విరుద్ధంగా ప్రేమ పేరుతో లేచిపోవడం, పెళ్ళికి ముందే గర్భం దాల్చడం, సహజీవనం చేయడం, పెళ్ళికి ముందే వివాహేతర సంబంధం పెట్టుకోవడం వంటి చెడు పనుల వల్ల ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు మాత్రమే కాకుండా ఆ యువతీయువకుల జీవితాలు కూడా సమాధి అవుతాయన్న సందేశంతో తెరకెక్కిన చిత్రమే ‘తీ ఇవన్‌’.

Thee Ivan: పెళ్ళికి ముందే వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి సందేశమిచ్చే చిత్రమిది
Thee Ivan Movie Poster

మనిదన్‌ సినీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మలా దేవి జయమురుగన్‌ నిర్మాణ సారథ్యంలో టీఎం జయమురుగన్‌ (TM Jayamurugan) దర్శకత్వం వహించిన చిత్రం ‘తీ ఇవన్‌’ (Thee Ivan). ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు కార్తీక్‌ (Karthik), సుకన్య (Sukanya), సన్నీ లియోన్‌ (Sunny Leone) ప్రధాన పాత్రలను పోషించారు. వీరితో పాటు సేతు అభిత, మస్కార, యువరాణి, రాధారవి, ఇళవరసు, జాన్‌ విజయ్‌, సింగం పులిం, శరవణ శక్తి, సుమన్‌, హేమంత్‌, శ్రీధర్‌ తదితరులు నటించారు. ఈ చిత్ర ఆడియోను ఇటీవల విడుదల చేశారు.

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... ‘పరాశక్తి’, ‘మామన్నన్‌’ తరహాలో సామాజిక దృక్పథంతో తెరకెక్కించాం. హీరో కార్తీక్‌... తన నటనా విశ్వరూపాన్ని మరోమారు చూపించారు. ఒక కుటుంబంలో యువతీ లేదా యువకుడు.. సంస్కృతి సంప్రదాయానికి విరుద్ధంగా ప్రేమ పేరుతో లేచిపోవడం, పెళ్ళికి ముందే గర్భం దాల్చడం, సహజీవనం చేయడం, పెళ్ళికి ముందే వివాహేతర సంబంధం పెట్టుకోవడం వంటి చెడు పనుల వల్ల ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు మాత్రమే కాకుండా ఆ యువతీయువకుల జీవితాలు కూడా సమాధి అవుతాయన్న సందేశంతో తెరకెక్కించాం.


Thee-Ivan.jpg

ఇందులో ఏడు పాటలు ఉండగా, ఒకటి సన్నీలియోన్‌ ఐటమ్‌ సాంగ్‌ (Sunny Leone Item Song). కుటుంబ సమేతంగా చూసే సినిమా. చెన్నై, పొల్లాచ్చి, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్‌లో సినిమా షూటింగ్‌ పూర్తి చేసి, వచ్చే నెలలో విడుదల చేస్తామని తెలిపారు. కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు సమకూర్చడమే కాకుండా, సంగీత స్వరాలు అందించిన జయమురుగన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కెమెరా వైఎన్‌ మురళి. ఎడిటింగ్‌ మహ్మద్‌ ఇత్రిస్‌, నేపథ్య సంగీతం ఏజే అలీ మిశ్రా.


ఇవి కూడా చదవండి:

============================

*Janam: రాజకీయ నాయకులతో పాటు జ‌నానికి కూడా చురకలు వేస్తున్నారట..

****************************************

*P Vasu: మా గాడ్ ఫాదర్ ఎన్టీఆరే..

****************************************

*Rambha: ప్లీజ్ ప్లీజ్ స్వామి.. అంటూ దేవుడ్ని ఏం వేడుకుందో చూశారా? వీడియో వైరల్!

****************************************

*Manchu Lakshmi: నా కష్టం.. నా సంపాదన.. నీకేమిరా నొప్పి?.. మంచు లక్ష్మీ ఫైర్!

*****************************************

*Aakasam Dhaati Vasthaava: ‘ఉన్నానో లేనో..’ ఆకట్టుకుంటోన్న మ్యాజికల్ మెలోడీ..

**********************************************

Updated Date - 2023-09-25T21:02:18+05:30 IST