Rambha: ప్లీజ్ ప్లీజ్ స్వామి.. అంటూ దేవుడ్ని ఏం వేడుకుందో చూశారా? వీడియో వైరల్!

ABN , First Publish Date - 2023-09-23T15:41:05+05:30 IST

రంభ.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసిన రంభ.. ఇప్పుడు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లిగా బాధ్యతలను నిర్వహిస్తోంది. తాజాగా రంభ ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో తన శరీరాన్ని ఎక్కడ బడితే అక్కడ పెంచేయవద్దని దేవుడుని రంభ వేడుకుంటోంది.

Rambha: ప్లీజ్ ప్లీజ్ స్వామి.. అంటూ దేవుడ్ని ఏం వేడుకుందో చూశారా? వీడియో వైరల్!
Rambha

రంభ (Rambha).. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసిన రంభ.. ఇప్పుడు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లిగా బాధ్యతలను నిర్వహిస్తోంది. పెళ్లి, పిల్లలు పుట్టే వరకు ఎక్కడా కనిపించని రంభ.. పిల్లలు కాస్త పెద్దవాళ్లు కావడంతో.. ఈ మధ్య సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా కనిపిస్తుంది. అలాగే మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. రీ ఎంట్రీకి సిద్ధమైనట్లుగా సిగ్నల్స్ పంపుతోంది. ప్రస్తుతం తన శరీరంపై దృష్టి పెట్టిన రంభ.. ప్రతి రోజూ దేవుడిని పూజిస్తూ.. ఏం కోరుకుంటుందో.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసి మరీ చెప్పుకొచ్చింది. అందులో.. (Senior Heroine Rambha)

‘‘ఏంటి దేవుడా.. ఏంటసలు? కూర బాగుంది కదా.. అని ఒక ముద్ద ఎక్కువ తింటే.. ఎక్కడ బడితే అక్కడ ఒళ్లు పెంచేస్తున్నావు. ఏ.. ఎందుకు? నీకు అంతగా ఇష్టం ఉంటే నా జుట్టు పెంచు.. సంతోషపడతాను. ఇంకా ఇష్టమైతే కలర్ పెంచు.. ఇంకా సంతోషపడతాను. నీకు అంతగా ప్రేమ ఎక్కువైతే నా ఆయుష్షు పెంచు.. లైఫ్ ఎంజాయ్ చేసేస్తాను. అంతేగానీ.. ఇదేంటయ్యా.. ఎక్కడ బడితే అక్కడ పెంచేస్తున్నావు. ఏం.. తిన్నది అన్నమే కదా.. ఇష్టపడి తిన్నాను. ఏయ్యా కష్టపెడుతున్నావు. ప్లీజ్ అర్థం చేసుకో.. ప్లీజ్ ప్లీజ్ స్వామి. ఎక్కడ బడితే అక్కడ నా ఒళ్లు పెంచవద్దు స్వామి... ప్లీజ్’’ అని రంభ ఈ వీడియోలో దేవుడిని వేడుకుంది. (Rambha Daily Routine Prayer to God)


Rambha.jpg

దీనికి నెటిజన్లు కూడా అంతే ఆసక్తికరంగా రియాక్ట్ అవుతున్నారు. ‘ఎక్కడ పెరిగినా.. మీరు అందంగానే ఉంటారు. వుయ్ లవ్ యు.. వుయ్ మిస్ యు’, ‘అడిగినవి అన్నీ చేస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు?’ అంటూ రకరకాలుగా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో రంభను చూస్తుంటే చాలా వరకు స్లిమ్‌గా మారినట్లే అనిపిస్తుంది. ఆమె లుక్ చూస్తుంటే.. త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందులోనూ ఇప్పుడు ఓటీటీలు వచ్చాక రంభ లాంటి వారికి అవకాశాలు బాగా వస్తున్నాయి కాబట్టి.. ఆమె రీ ఎంట్రీకి సంబంధించి త్వరలోనే న్యూస్ వచ్చే అవకాశం లేకపోలేదు. (Rambha Video)


ఇవి కూడా చదవండి:

============================

*Manchu Lakshmi: నా కష్టం.. నా సంపాదన.. నీకేమిరా నొప్పి?.. మంచు లక్ష్మీ ఫైర్!

*****************************************

*Aakasam Dhaati Vasthaava: ‘ఉన్నానో లేనో..’ ఆకట్టుకుంటోన్న మ్యాజికల్ మెలోడీ..

**********************************************

*Rashmika Mandanna: ‘యానిమల్’ నుంచి నేషనల్ క్రష్ లుక్కొచ్చింది

**************************************

*Vishal: న్యాయస్థానం కంటే గొప్ప వ్యక్తిగా భావించొద్దు.. విశాల్‌కు హైకోర్టు చురకలు

**************************************

*Devil: ‘డెవిల్’లోని ‘మాయే చేసి’ పాట కోసం ఎలాంటి వాయిద్యాలు వాడారో చూశారా?

**************************************

Updated Date - 2023-09-23T15:41:32+05:30 IST