P Vasu: మా గాడ్ ఫాదర్ ఎన్టీఆరే..

ABN , First Publish Date - 2023-09-25T17:18:38+05:30 IST

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘చంద్రముఖి 2’. పి. వాసు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. దర్శకుడు పి. వాసు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ దగ్గర తన తండ్రి పీతాంబరం వర్క్ చేసిన రోజులని గుర్తు చేసుకున్నారు.

P Vasu: మా గాడ్ ఫాదర్ ఎన్టీఆరే..
Director P Vasu

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ (Kangana Ranaut) టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ (Lyca Productions) బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు (P Vasu) తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా విడుద‌లకాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై రిలీజ్ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పి.వాసు మాట్లాడుతూ.. ‘‘మాకు ఈ సినిమాను ఇచ్చిన లైకా వారికి థ్యాంక్స్. నా సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా నాన్న పీతాంబరం‌గారు (ఎన్టీఆర్‌కి మేకప్ వేసే పీతాంబరం కుమారుడే పి. వాసు) లేకపోయి ఉంటే మేం ఇక్కడ ఉండేవాళ్లం కాదు. మా గాడ్ ఫాదర్ ఎన్టీఆర్ (NTR) గారే. ఆయనే మాకు అన్నీ ఇచ్చారు. ‘చంద్రముఖి’ మొదటి పార్ట్‌కు విద్యాసాగర్‌గారు సంగీతం అందించారు. రెండో పార్ట్‌కు కీరవాణిగారు రావడం మా అదృష్టం. విద్యాసాగర్‌గారు ఎందుకు చేయడం లేదు? అని కీరవాణి గారు అడిగారు. అది ఆయన గొప్పదనం. ముందు కీరవాణిగారు విద్యాసాగర్‌కే ఫోన్ చేసి చెప్పారు. చైతన్య గారు అద్భుతంగా పాటలు రాసి ఇచ్చారు. సినిమాకు పని చేసిన నా టీంకు థాంక్స్. (P Vasu Speech)


Raghava-Lawrence.jpg

కంగనా ఈ సినిమా చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. లారెన్స్ మాస్టర్ ఈ సినిమా ఒప్పుకోవడం సంతోషంగా అనిపించింది. గ్రూప్ డ్యాన్స్‌లో చివర్లో ఉన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఆయన కష్టపడే తత్త్వమే ఈ విజయానికి కారణం. మాస్టర్‌ను డైరెక్ట్ చేశాను అని నాకు గర్వంగా ఉంది. సెప్టెంబర్ 28న సినిమా రాబోతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఎన్వీ ప్రసాద్ గారు ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ప్రేక్షక దేవుళ్లు మా సినిమాను చూసి విజయవంతం చేయాలని కోరుతున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Rambha: ప్లీజ్ ప్లీజ్ స్వామి.. అంటూ దేవుడ్ని ఏం వేడుకుందో చూశారా? వీడియో వైరల్!

****************************************

*Manchu Lakshmi: నా కష్టం.. నా సంపాదన.. నీకేమిరా నొప్పి?.. మంచు లక్ష్మీ ఫైర్!

*****************************************

*Aakasam Dhaati Vasthaava: ‘ఉన్నానో లేనో..’ ఆకట్టుకుంటోన్న మ్యాజికల్ మెలోడీ..

**********************************************

*Rashmika Mandanna: ‘యానిమల్’ నుంచి నేషనల్ క్రష్ లుక్కొచ్చింది

**************************************

Updated Date - 2023-09-25T17:18:38+05:30 IST