Rest in Peace: ‘పరిణీత’ దర్శకుడి మృతి.. ప్రముఖుల సంతాపం

ABN , First Publish Date - 2023-03-24T11:56:11+05:30 IST

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ప్రదీప్ సర్కార్ (Pradeep Sarkar). కన్నుమూశారు

Rest in Peace: ‘పరిణీత’ దర్శకుడి మృతి.. ప్రముఖుల సంతాపం
Pradeep Sarkar

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు ప్రదీప్ సర్కార్ (Pradeep Sarkar) కన్నుమూశారు. ఆయన ‘పరిణీత’ (Parineeta), మర్దానీ (Mardaani) వంటి సూపర్ హిట్ చిత్రాలతో బీ టౌన్‌లో గుర్తింపు పొందారు. 67 ఏళ్ల వయస్సులో ఆయన మృతి చెందడంతో చిత్ర పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతి విషయాన్ని ఆయన స్నేహితుడు, ఫిల్మ్‌మేకర్ హన్సల్ మెహతా (Hansal Mehta) సోషల్ మీడియా వేదిక వెల్లడించారు. (#PradeepSarkar)

దీంతో బాలీవుడ్‌లోని ప్రముఖులు ప్రదీప్‌కి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. మనోజ్ బాజ్ పాయ్, అజయ్ దేవ్‌గణ్ వంటి ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ‘అది చాలా షాకింగ్‌గా ఉంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి దాదా’ అని మనోజ్.. ‘‘మనలో కొందరికి ‘దాదా’ ప్రదీప్ సర్కార్ మరణవార్తని జీర్ణించుకోవడం కష్టం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. RIP దాదా’ అని అజయ్ దేవ్‌గణ్ రాసుకొచ్చారు. (#RestinPeace)

కాగా.. కోల్‌కతాలో 1955లో జన్మించిన ప్రదీప్ సర్కార్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్‌ చేయడం ద్వారా సృజనాత్మక ప్రపంచంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అందులో ఆయన ఏకంగా బంగారు పతకంతో అందుకుని గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు దాదపు 20 సంవత్సరాల వరకు ప్రకటనలకి సంబంధించిన ఫీల్డ్‌లో పని చేశారు. అనంతరం 1990 దశకం చివరిలో ఎడిటింగ్, దర్శకత్వం వైపు మళ్లి మొదట మ్యూజిక్ వీడియోలు, సినిమాల వైపు వచ్చారు. పలు చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేసిన పిదప.. 2005లో ‘పరిణీత’ చిత్రంతో డైరెక్టర్‌గా మారారు. ఆ చిత్రం సూపర్ హిట్‌గా నిలవడంతొ పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అనంతరం ‘లాగా చునారి మే దాగ్’, ‘లఫాంగే పరిందే’, ‘మర్దాని2 వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి:

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

Updated Date - 2023-03-24T12:25:38+05:30 IST