Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

ABN , First Publish Date - 2023-03-20T08:51:54+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు. విజయవంతంగా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు.

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు. విజయవంతంగా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. అయితే.. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఒకే ఒక్క నటి నిహారిక కొణిదెల (Niharika Konidela). మెగా ఫ్యాన్స్ ఆమెను మెగా ప్రిన్సెస్ అని పిలుచుకుంటూ ఉంటారు. మొదట నిర్మాతగా మారిన ఈ మెగా బ్రదర్ నాగబాబు కూతురు అనంతరం నాగశౌర్య హీరోగా చేసిన ‘ఒక మనసు’ (Oka Manasu)తో హీరోయిన్‌గా మారింది.

అయితే.. మొదటి చిత్రంలోని నిహారిక నటనకి మంచి మార్కులే పడ్డా.. సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. అనంతరం మరికొన్ని సినిమాలు చేసిన అవి కూడా సక్సెస్ కాలేదు. దీంతో నిర్మాతగా కొనసాగుతూ పలు వెబ్‌సిరీస్‌లను నిర్మించింది. అవన్నీ కూడా మంచి విజయాన్ని అందుకుని నిహారికకు మంచి పేరుని తీసుకొచ్చాయి. (Niharika Konidela)

కాగా.. నిహారికకి చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda)తో డిసెంబర్ 9న, 2020న వివాహం అయిన సంగతి తెలిసిందే. అయితే.. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. వాటిలో ఏమాత్రం నిజం లేదని ఇరు కుటుంబాలు కొట్టేస్తూ వచ్చాయి. అయినా ఆ ప్రచారానికి అడ్డుకట్ట పడలేదు. ఇంక పెరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలోనే ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా చైతన్య అయితే.. వారి పెళ్లి పిక్స్‌(Marriage Pics)ని ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. కానీ.. తాజాగా వచ్చిన ఈ వార్తలపై ఇంతవరకు ఇటు నిహారికకాని, అటు చైతన్యకాని స్పందించలేదు. ఇరు కుటుంబాలు స్పందిస్తేకాని ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.

ఇవి కూడా చదవండి:

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు

Updated Date - 2023-03-20T08:51:55+05:30 IST