Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

ABN , First Publish Date - 2023-03-21T11:15:55+05:30 IST

సోషల్‌ మీడియాలో తాను చనిపోయినట్లు వార్తలను నమ్మొద్దని సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) తెలిపారు.

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా
Kota Srinivasa Rao

సోషల్‌ మీడియాలో తాను చనిపోయినట్లు వార్తలను నమ్మొద్దని సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) తెలిపారు. కావాలని అలాంటి వార్తలను ప్రచారం చేయడం బాధాకరమని ఆయన చెప్పుకొచ్చారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు కోటా పేర్కొన్నారు. సోషల్ మీడియా తాన చనిపోయినట్లు వస్తున్న వార్తలపై కోటా తాజాగా స్పందించారు. (Kota Srinivasa Rao on Rumours)

రేపు జరుగబోయే ఉగాది పండుగ ఏర్పాట్లు చూసుకుంటున్న తనకు ఇలా వరుసగా చాలా ఫోన్ కాల్స్ రావడం ఆందోళన కలిగించిందని చెప్పారు. అదే కొంచెం పెద్ద వాళ్లైతే నిజంగా గుండె ఆగి చనిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఆ వార్తల వల్ల తన ఇంటి వద్ద భద్రత కోసం ఏకంగా 10 మంది పోలీసులు వచ్చారని కోటా బాధను వ్యక్తం చేశారు. పాపులారిటీ, డబ్బు కావాలంటే వేరే మార్గాల్లో సంపాదించుకోవచ్చని, ఇలా పుకార్లను వ్యాప్తి చేయడం మంచి కాదని హెచ్చరించారు. మనుషుల జీవితాలతో ఆడుకోవడం.. దారుణమైన విషయమని చెప్పారు. ఇలాంటి చర్యలను ప్రజలు తీవ్రంగా ఖండించాలని తెలిపారు. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని కోటా ప్రజలను, టాలీవుడ్ సినీ ప్రేక్షకులను కోరారు. (Kota Srinivasa Rao on Rumours)

ఇవి కూడా చదవండి:

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Updated Date - 2023-03-21T11:23:53+05:30 IST