NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

ABN , First Publish Date - 2023-03-23T11:51:11+05:30 IST

ఎట్టకేలకు ఎన్టీఆర్ (NTR) కొత్త సినిమా మొదలైంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై దాదాపు సంవత్సర కాలం గడిపోయిన విషయం తెలిసిందే..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్
NTR30

ఎట్టకేలకు ఎన్టీఆర్ (NTR) కొత్త సినిమా మొదలైంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై దాదాపు సంవత్సర కాలం గడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. చాలాకాలం క్రితమే కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ మూవీ కమిటైన విషయం తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ (NTR30) వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం గురించి అప్పటి నుంచి యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఈ చిత్ర ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలోనే ఈ చిత్ర పూజా కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌, కొరటాల శివ, జాన్వీకపూర్‌ (Jahnvi Kapoor), ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, సంగీత దర్శకుడు, ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్, సంగీత దర్శకుడు అనిరుధ్‌, నిర్మాత కల్యాణ్‌ రామ్‌ పాల్గొన్నారు. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ముఖ్య అతిథిగా హాజరై.. ఎన్టీఆర్‌-జాన్వీకపూర్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను మూవీటీంకి అందజేశారు.

ntr1.jpg

ఎన్టీఆర్ 30 ముహుర్తం వేడుకలో జాన్వీనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సమయంలోనే ఎన్టీఆర్, జాన్వీ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ.. ‘జనతాగ్యారేజ్ తర్వాత సోదరుడు ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఎవరూ పట్టించుకోని ఓ తీర ప్రాంత బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది. అక్కడ ఉండే కొందరూ భయకరమైన మనుషులకి భయం అంటే ఏంటో తెలియదు. చావుకి కూడా భయపడరు. అలాంటి వారిని భయపెట్టే వ్యక్తి కథే ఈ చిత్రం’ అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో #NTR30, #NTR30StormBegins ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Updated Date - 2023-03-23T12:13:28+05:30 IST