Allu Arjun: తన హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

ABN , First Publish Date - 2023-03-19T10:20:28+05:30 IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 2010లో నటించిన చిత్రం ‘వరుడు’ (Varudu) చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ భానుశ్రీ మెహ్రా.

Allu Arjun: తన హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..
Allu Arjun

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 2010లో నటించిన చిత్రం ‘వరుడు’ (Varudu) చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ భానుశ్రీ మెహ్రా (Bhanushree Mehra). గుణశేఖర్ (Gunashekar) దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. దీంతో ఈ భామకి అంత క్రేజ్ రాలేదు. దీంతో అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే తాజాగా అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశాడని ట్విట్టర్‌ (Twitter)లో ఓ స్క్రీన్ షాట్‌‌ని ఈ భామ షేర్ చేసింది.

భానుశ్రీ మెహ్రా ‘మీరు ఎప్పుడైనా ఒక మూసలో పడిపోయినప్పుడు, నేను అల్లు అర్జున్‌తో ‘వరుడు’లో నటించానని గుర్తుంచుకోండి. ఇప్పటికీ సరైన అవకాశాలు రావట్లేదు. కానీ ఈ ఇబ్బందుల్లోనూ జాలీగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విట్టర్‌లో బ్లాక్ చేయడం వల్ల’ అని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో ‘మీ కెరీర్‌కి అల్లు అర్జున్‌కి ఏంటి సంబంధం.. ఆయన్ని అవమానించకండి’ అని బన్నీ ఫ్యాన్స్ రాసుకొస్తున్నారు. వాటికి భాను స్పందిస్తూ.. ‘నా ప్రస్తుత పరిస్థితి గురించి సరదాగా తెలపడం కోసమే అలా రాసుకొచ్చాను. వరుడులో అర్జున్‌తో కలిసి పని చేయడం నాకేంతో నచ్చింది’ అని రాసుకొచ్చింది. (Allu Arjun Blocked Bhanushree)

ఇవి కూడా చదవండి:

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Rana Naidu Webseries: ఛీఛీ.. ఇలా చేశారేంటి?.. దగ్గుబాటి హీరోలని ఆడేసుకుంటున్న నెటిజన్లు


ఈ ట్వీట్ తర్వాత భానుని అల్లు అర్జున్ అన్‌బ్లాక్ చేశాడు. ఈ విషయాన్ని కూడా తెలుపుతూ స్క్రీన్ షాట్‌ని షేర్ చేసింది. దానికి.. ‘మంచి వార్త, అల్లు అర్జున్ నన్ను అన్‌బ్లాక్ చేశాడు!. అలాగే ఓ విషయం. నా కెరీర్ వైఫల్యాలకు నేను అతనిని ఎప్పుడూ నిందించలేదు. బదులుగా, ఈ పరిస్థితుల్లో నవ్వుతూ ముందుకు సాగడం నేర్చుకున్నా. మరిన్ని నవ్వులు, పాజిటివ్ వైబ్స్ కోసం ఎదురుచూస్తూ ఉండండి. స్పోర్టివ్‌గా తీసుకున్నందుకు అల్లు అర్జున్‌కి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది. (Allu Arjun Unblocked Bhanushree)

కాగా.. భానుశ్రీ మెహ్రా చివరిసారిగా 2021లో విడుదలైన ‘మరో ప్రస్థానం’ చిత్రంలో నటించింది. అనంతరం ఓ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించి.. వ్లాగ్స్ చేయడం ప్రారంభించింది. ఆ ఛానెల్‌కి ప్రస్తుతం 5.43K సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. తను అల్లు అర్జున్ గురించి చేసిన పోస్టుల్లో తన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయమని భాను శ్రీ కోరింది. (Allu Arjun unblocked Bhanushree)

Updated Date - 2023-03-19T10:31:00+05:30 IST