Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

ABN , First Publish Date - 2023-03-24T10:13:22+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఇంట్లో విషాదం నెలకొంది.

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం
Ajith kumar

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి పి.సుబ్రమణ్యం (Ajith Kumar) కన్నుమూశారు. 84 ఏళ్ల సుబ్రమణ్యం గత కొంతకాలంగా వయస్సు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటికి చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఈ తరుణంలో శుక్రవారం (మార్చి 24న) ఉదయం ఆయన కన్నుమూశారు. దీంతో కోలీవుడ్‌ (Kollywood)కి ఎంతోమంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ‘మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ (Rest In Peace) అంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. అలాగే.. అజిత్ కుమార్ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

అయితే.. అజిత్ ప్రస్తుతం భార్య షాలిని, పిల్లలతో యూరోప్‌ టూర్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన అక్కడి నుంచి బయలుదేరారు. అజిత్ చెన్నై చేరుకోగానే.. మిగిలిన కార్యక్రమాలపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. (#RestInPeace)

నిజానికి పి.సుబ్రమణ్యం కేరళ (Kerala)లోని పాలక్కాడ్‌కు చెందిన మలయాళీ. ఆయన భార్య మోహిని బెంగాల్‌కి చెందినవారు. ఈ జంటకి ముగ్గురు పిల్లలు అనుప్ కుమార్, అజిత్ కుమార్, అనిల్ కుమార్. ఈ ముగ్గురిలో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట తెలంగాణలోని సికింద్రాబాద్‌లో మెకానిక్‌గా పని చేశారు. అనంతరం టాలీవుడ్, కోలీవుడ్‌లతో సినిమాల కోసం ప్రయత్నించి వరుస అవకాశాలతో స్టార్‌గా ఎదిగారు. ముఖ్యంగా.. తమిళంలో ఆయనకి పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయినా ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారనే పేరుని సంపాదించుకున్నారు. ఇటీవలే ‘తెగింపు’ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన అజిత్.. తదుపరి ప్రాజెక్ట్‌ గురించి కథలు వింటున్నారు. (#AjithKumar)

ఇవి కూడా చదవండి:

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

Updated Date - 2023-03-24T10:13:23+05:30 IST