RamCharanBdaySplCDP: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ సీడీపీ వైరల్

ABN , First Publish Date - 2023-03-24T19:05:21+05:30 IST

మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పుట్టినరోజు. ఈ పుట్టినరోజు రామ్ చరణ్‌ ఎంతో స్పెషల్. అందుకే మెగా ఫ్యాన్స్ (Mega Fans) నెల రోజుల ముందు నుంచే

RamCharanBdaySplCDP: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ సీడీపీ వైరల్
Mega Power Star Ram Charan

మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పుట్టినరోజు. ఈ పుట్టినరోజు రామ్ చరణ్‌ ఎంతో స్పెషల్. అందుకే మెగా ఫ్యాన్స్ (Mega Fans) నెల రోజుల ముందు నుంచే రామ్ చరణ్ (Ram Charan) బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన హడావుడి చేస్తున్నారు. నెల రోజుల నుంచి ఏదో ఒక సమయంలో ఈ గ్లోబల్ స్టార్ (Global Star) పేరు నెట్ ప్రపంచంలో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు పుట్టినరోజు దగ్గర పడటంతో.. మెగా ఫ్యాన్స్ మరింతగా హంగామా మొదలెట్టారు. తాజాగా రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ సీడీపీని (RamCharanBdaySplCDP) మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

‘‘అన్నయ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ సీడీపీని విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్యా.. నీ హార్డ్ వర్క్‌తో అలాగే హంబుల్ నేచర్‌తో ఇలాగే ఇన్‌స్ఫైర్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. లవ్ యూ అన్నా.. ’’ అని తెలుపుతూ.. వరుణ్ తేజ్ ఈ సీడీపీని విడుదల చేశారు. ఈ బర్త్‌డే స్పెషల్ సీడీపీని మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం #RamCharanBdaySplCDP ట్రెండింగ్‌లో ఉంది. (Varun Tej about Ram Charan)

Ram-Charan.jpg

ఈ బర్త్‌డే రామ్ చరణ్‌కి ఎంత స్పెషల్ అంటే.. తను నటించిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రానికి ఆస్కార్ అవార్డ్ (Oscar Award) రావడంతో పాటు.. త్వరలో తండ్రిగానూ (Father) ప్రమోషన్ పొందబోతున్నారు. అందువల్ల ఈ బర్త్‌డే ఆయనకి ఎంతో స్పెషల్‌ అని చెప్పుకోవచ్చు. ఇక వరుణ్ తేజ్ వదిలిన సీడీపీలో.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని రామ్ అవతారంలో చరణ్ కనిపిస్తున్నారు. ఉదయిస్తున్న సూర్యుడిలా.. ఒక గాడ్ నడిచివస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో చరణ్‌ని ఎలివేట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ మాదిరిగా ‘ఆర్‌సి’ (RC) టైటిల్‌ను, టైటిల్ కింద గ్లోబల్ స్టార్ (Global Star) అంటూ ట్యాగ్‌ను జత చేశారు. పక్కన ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ గుర్రంపై స్వారీ చేసే ఇమేజ్‌తో పాటు.. దైవత్వం ఉట్టిపడేలా హనుమాన్ జెండాలతో పోస్టర్‌ని నింపేశారు. ఇదే కాకుండా.. రానున్న మూడు రోజుల్లో చరణ్ బర్త్‌డేకు సంబంధించి మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?

*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..

*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!

*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు

*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు

*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?

*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?

*Das Ka Dhamki: ఇదేందయ్యా ఇది.. ‘ధమ్కీ’నా? ‘ధమాకా’నా?

*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?

Updated Date - 2023-03-24T19:05:22+05:30 IST