TholiPrema Re Release: సపోర్ట్ చేసేదే లేదంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?

ABN , First Publish Date - 2023-05-24T19:07:09+05:30 IST

పవన్ కల్యాణ్ కెరీర్‌ని టాప్ స్థాయికి చేర్చిన ‘తొలిప్రేమ’ చిత్రాన్ని జూన్ 30న రీ రిలీజ్ చేసేందుకు శ్రీ మాతా క్రియేషన్స్ సంస్థ వారు ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి మెగా ఫ్యాన్స్ అస్సలు అంగీకరించడం లేదు. ఎటువంటి సమయం, సందర్భం లేకుండా పర్సనల్ ప్రాఫిట్స్ కోసం ఈ సినిమాని విడుదల చేస్తే మాత్రం బాయ్‌కాట్ చేస్తామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

TholiPrema Re Release: సపోర్ట్ చేసేదే లేదంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?
Pawan Kalyan Tholiprema Movie Poster

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘పోకిరి’ (Super Star Mahesh Babu Pokiri Movie)తో మొదలైన ఈ ట్రెండ్.. అస్సలు ఆగేదే లే అన్నట్లుగా దూసుకెళుతోంది. స్టార్ హీరోల చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. ‘పోకిరి’ తర్వాత ‘జల్సా’, ‘ఖుషి’, ‘బిల్లా’, ‘ఆరెంజ్’, ‘ఆది’, ‘సింహాద్రి’ ఇలా వరుసగా సినిమాలు రీ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ రీ రిలీజ్‌లో కొన్ని సినిమాలు భారీగా కలెక్షన్స్ రాబడితే.. మరికొన్ని చిత్రాలు మాత్రం చడీచప్పుడు లేకుండా వెళ్లిపోయాయి. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ (Power Star Pawan Kalyan)కు సంబంధించిన చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌ను రాబట్టి రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో ఆయన సినిమాలను మరికొన్నింటిని రీ రిలీజ్ చేసేందుకు కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా పవన్ కల్యాణ్‌ కెరీర్‌‌లో ఎంతో ముఖ్యమైన సినిమా ‘తొలిప్రేమ’ (TholiPrema)ని మళ్లీ రీ రిలీజ్ చేసేందుకు శ్రీ మాతా క్రియేషన్స్ (Sri Matha Creations) సంస్థ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ (Mega Fans) రివర్స్ అవుతున్నారు. అసలీ సినిమాకు సపోర్ట్ చేసేదే లే అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్‌తో కదం తొక్కుతున్నారు. అందుకు కారణం ఏమిటంటే..

‘తొలిప్రేమ’ సినిమా రీ రిలీజ్‌కు సంబంధించి విడుదల తేదీని కూడా ఎస్ఎమ్‌సి (SMC) వారు అనౌన్స్ చేశారు. ‘జూన్ 30’న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా వారు ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఆ టైమ్‌కి విడుదల చేయడం మెగా ఫ్యాన్స్‌కి అస్సలు నచ్చడం లేదు. అందుకే డెసిషన్ మార్చుకోమంటూ ఒకటే హడావుడి చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. జూలై 28న ‘బ్రో’ (Bro) సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ బర్త్‌డేకి అంటే సెప్టెంబర్‌లో ‘గుడుంబా శంకర్’ (Gudumba Shankar) రీ రిలీజ్‌కు ఫ్యాన్స్ ప్లాన్ చేశారు. డిశంబర్ లేదంటే జనవరి‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్ (UBS) లేదంటే ఓజీ (OG)’ సినిమా రిలీజ్ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కెరీర్‌లో క్లాసిక్ హిట్ అయినటువంటి ఈ చిత్రాన్ని సమయం, సందర్భం లేకుండా రీ రిలీజ్ చేయడం ఏమిటంటూ వారు గోల చేస్తున్నారు.

Tholiprema-1.jpg

మరో కారణం ఏమిటంటే.. ఇంతకు ముందు రీ రిలీజైన పవన్ కల్యాణ్ సినిమాలకు వచ్చిన ఆదాయంలో కొంత ‘జనసేన’ పార్టీ (Janasena Party)కి ఫండ్‌గా ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాలకు ఫుల్ సపోర్ట్ అందించారు. కానీ ఈ సినిమాని వేరే వారు.. పర్సనల్‌గా విడుదల చేస్తుండటం కూడా ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు. అందుకే ‘తొలిప్రేమ’ని రీ రిలీజ్ చేస్తున్న వారికి సూటిగానే ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మెగా ఫ్యాన్స్, జనసేన పార్టీ అభిమానులు ఈ సినిమాను బాయ్‌కాట్ (Boycott) చేయాలంటూ పిలుపునిస్తున్నారు. మరి ఫ్యాన్స్ నిర్ణయాన్ని శ్రీ మాతా క్రియేషన్స్ సంస్థ వారు ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే.. ‘తొలిప్రేమ’ రీ రిలీజ్‌కు సంబంధించి ఫ్యాన్స్ హడావుడి అయితే సోషల్ మీడియాలో ఇసుమంత కూడా కనిపించడం లేదు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Virinchi Varma: కామ్‌గా షూటింగ్ మొదలెట్టేసిన దర్శకుడు

*Tiger Nageswara Rao Glimpse: పులుల్ని వేటాడే పులిని చూశారా? అయితే చూడండి..

*Nene Raju Nene Mantri: జోగేంద్ర పాత్రను మించేలా.. కాంబినేషన్ రిపీట్!

*Hansika: టాలీవుడ్ హీరో వేధించాడంటూ వార్తలు.. హన్సిక ఎలా రియాక్ట్ అయిందంటే?

*Ganda: ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ స్ఫూర్తితో.. జీరో బ‌డ్జెట్ మూవీ

*Chiru Leaks: మెగాస్టార్ ఈసారి ఏం లీక్ చేశారంటే..?

Updated Date - 2023-05-24T19:07:09+05:30 IST