Virinchi Varma: కామ్‌గా షూటింగ్ మొదలెట్టేసిన దర్శకుడు

ABN , First Publish Date - 2023-05-24T18:08:05+05:30 IST

‘ఉయ్యాల జంపాల, మజ్ను’ చిత్రాల దర్శకుడు విరించి వర్మ తన తదుపరి చిత్రాన్ని కామ్‌గా ప్రారంభించారు. తెలంగాణ నేపథ్యంలో 1980లో జరిగే ఒక పిరియాడిక్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. అలాగే రియల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కనుంది. పూర్తి వివరాలు త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.

Virinchi Varma: కామ్‌గా షూటింగ్ మొదలెట్టేసిన దర్శకుడు
Director Virinchi Varma Next Film Update

‘ఉయ్యాల జంపాల (Uyyala Jampala), మజ్ను (Majnu)’ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ (Virinchi Varma). ప్రస్తుతం ఆయన నూతన నటీనటులతో ఒక సినిమాను ప్రారంభించారు. ముదుగంటి క్రియేషన్స్ (Muduganti Creations) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ను దర్శకుడు ఎటువంటి ఆర్భాటం లేకుండా కామ్‌గా మొదలుపెట్టేశారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది.

సినిమా విషయానికి వస్తే.. ఇది 1980లో జరిగే ఒక పిరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. తెలంగాణ (Telangana) నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్‌ను బేస్ చేసుకొని నడిచే కథగా ఈ చిత్రం ఉండబోతోందని అంటున్నారు. విరించి వర్మ గత చిత్రాలు అంటే ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ వంటి లవ్ స్టోరీస్‌‌ని డీల్ చేయగా.. ఈసారి మాత్రం ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో దిగుతున్నట్లుగా సమాచారం. అందుకే ఏ చిన్న క్లూ ఇవ్వకుండా.. కామ్‌గా షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. (Virinchi Varma Next Film Update)

ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలతో పాటు టైటిల్, ఫస్ట్ లుక్‌ను కూడా త్వరలోనే మీడియాకు చిత్రయూనిట్ తెలియజేయనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ వి.ఎస్. జ్ఞానశేఖర్ (Gnana Shekar V. S.) ఈ సినిమాకు కెమెరామెన్‌గా వర్క్ చేస్తుండగా.. గోపీ సుందర్ (Gopi Sundar) సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ (Nagendra Kumar) ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Tiger Nageswara Rao Glimpse: పులుల్ని వేటాడే పులిని చూశారా? అయితే చూడండి..

*Nene Raju Nene Mantri: జోగేంద్ర పాత్రను మించేలా.. కాంబినేషన్ రిపీట్!

*Hansika: టాలీవుడ్ హీరో వేధించాడంటూ వార్తలు.. హన్సిక ఎలా రియాక్ట్ అయిందంటే?

*Ganda: ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ స్ఫూర్తితో.. జీరో బ‌డ్జెట్ మూవీ

*Chiru Leaks: మెగాస్టార్ ఈసారి ఏం లీక్ చేశారంటే..?

*Bro: మార్క్.. సాయిధరమ్ తేజ్ లుక్కొచ్చింది

Updated Date - 2023-05-24T18:08:05+05:30 IST