Tiger Nageswara Rao: ఆ రూమర్స్‌కు బ్రేక్ వేస్తూ.. మరోసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ

ABN , First Publish Date - 2023-08-01T17:47:58+05:30 IST

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే రిలీజ్ డేట్‌పై కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తుండటంతో మరోసారి మేకర్స్ అదే డేట్‌ని కన్ఫర్మ్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.

Tiger Nageswara Rao: ఆ రూమర్స్‌కు బ్రేక్ వేస్తూ.. మరోసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ
Tiger Nageswara Rao Still

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ (Abhishek Agarwal Arts) పతాకంపై మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) టైటిల్ రోల్‌లో నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ విషయం ఇంతకు ముందే అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఆలస్యమయ్యే అవకాశం ఉందనేలా కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో.. మేకర్స్ వాటిని ఖండిస్తూ ఓ లేఖను అధికారికంగా విడుదల చేశారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదలలో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేశారు. (Clarity on Tiger Nageswara Rao Release Date)


టీమ్ విడుదల చేసిన లేఖలో.. ‘‘టైగర్‌ నాగేశ్వరరావు సినిమా.. అక్టోబర్ 20న విడుదల కావడం లేదని నిరాధారమైన ఊహాగానాలు వచ్చాయి. కొన్ని శక్తులు ఈ రూమర్స్‌ని వ్యాప్తి చేస్తున్నాయి. ఎందుకంటే మా చిత్రం ప్రేక్షకుల నుంచి గొప్ప ఆసక్తిని సంపాదించింది. థియేట్రికల్ ఎకోసిస్టమ్‌లోని వివిధ స్టేక్ హోల్డర్స్ నుంచి మొదటి ప్రాధాన్యత పొందింది. ఈ సినిమా విడుదల విషయమై వస్తున్న ఎలాంటి వదంతులను నమ్మవద్దు. మీకు అత్యుత్తమ సినిమా అనుభూతిని అందించడానికి మేము కృషి చేస్తున్నాము. అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్ వద్ద టైగర్ వేట ప్రారంభమవుతుంది’’ అని మేకర్స్ తెలియజేశారు.

Tiger.jpg

రీసెంట్‌గా రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్‌లాక్ బ్రిడ్జ్ (గోదావరి)పై ఫస్ట్-లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియోను లాంచ్ చేయడం ద్వారా మేకర్స్ సినిమా ప్రమోషన్‌లను యూనిక్ స్టైల్‌లో ప్రారంభించారు. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు వంశీ ఒక విన్నింగ్ స్క్రిప్ట్‌ని ఎంచుకుని, దానిని ఆకట్టుకునే రీతిలో ప్రజంట్ చేస్తున్నట్లుగా నిర్మాత చెబుతున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రవితేజకు జోడిగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Mrunal Thakur: బర్త్‌డే స్పెషల్‌గా ‘హాయ్ నాన్న’ టీమ్ ఇచ్చిన ట్రీట్ ఇదే..

**************************************

*Navdeep: స్వామీ.. నదికి పోలేదా? అంటే.. ‘నదే సిటీకి వచ్చింది’ అంటూ ప్రభుత్వంపై పంచ్

**************************************

*S Thaman: సాయి తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత బాధపడ్డానంటే..

**************************************

*Chandramukhi 2: రాజు వేషంలో లారెన్స్ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?

**************************************

Updated Date - 2023-08-01T17:47:58+05:30 IST