Navdeep: స్వామీ.. నదికి పోలేదా? అంటే.. ‘నదే సిటీకి వచ్చింది’ అంటూ ప్రభుత్వంపై పంచ్

ABN , First Publish Date - 2023-07-31T19:31:37+05:30 IST

నవదీప్ పేరు టాలీవుడ్‌లోని ప్రేక్షకులందరికీ పరిచయమే. ఒకప్పుడు హీరోగా విభిన్న పాత్రలలో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు హీరోగా చేస్తూనే.. మధ్యలో తన దగ్గరకు వచ్చిన మంచి పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన వర్షాల కారణంగా హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉందంటూ.. తెలంగాణ ప్రభుత్వంపై పేల్చిన ఓ పంచ్.. ఆయనని వార్తలలో ఉంచుతోంది.

Navdeep: స్వామీ.. నదికి పోలేదా? అంటే.. ‘నదే సిటీకి వచ్చింది’ అంటూ ప్రభుత్వంపై పంచ్
Navdeep Post on Hyderabad Rains

నవదీప్ (Navdeep) పేరు టాలీవుడ్‌లోని ప్రేక్షకులందరికీ పరిచయమే. ఒకప్పుడు హీరోగా విభిన్న పాత్రలలో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. ఇప్పుడు హీరోగా చేస్తూనే.. మధ్యలో తన దగ్గరకు వచ్చిన మంచి పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా పేల్చిన ఓ పంచ్.. ఆయనని వార్తలలో ఉంచుతోంది. మరి కావాలని అన్నాడో.. లేక పంచ్ కోసం అలా పేల్చాడో తెలియదు కానీ.. నవదీప్ పేరు మాత్రం ఈ విషయంలో వైరల్ అవుతోంది.


నవదీప్ తన ఇన్‌స్టాగ్రమ్ స్టేటస్‌లో (Navdeep Insta Post) ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో.. ఓ యువతి.. ‘స్వామీ.. నదికి పోలేదా?’ అని అడిగితే.. ‘అవసరం లేదే.. నదే సిటీకి వచ్చింది’ అంటూ సమాధానం చెప్పారు. ఆ సమాధానం విన్న ఆ యువతి అవాక్కయింది. అంటే కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉందని చెప్పడానికి నవదీప్ ఈ వీడియోని చేసినట్లుగా ఉంది. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా.. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి సముద్రాన్ని తలపిస్తున్న క్రమంలో.. నవదీప్.. ఇలా వెరైటీగా ఉదహరించే ప్రయత్నం చేశారు.

Navdeep.jpg

ఈ వీడియో చూసిన వారంతా.. నవదీప్‌కు వంత పాడుతున్నారు. నిజమే కదా.. నది సిటీకి వచ్చేసింది. పడవలు వేసుకుని ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా రావచ్చు అంటూ ప్రభుత్వానికి చురకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నపాటి వర్షం పడినా.. టాప్ సిటీలలో ఒకటిగా పేరున్న హైదరాబాద్‌ (Hyderabad)లో ఇది పరిస్థితి అనేలా.. నవదీప్ వీడియో ఉందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే.. ప్రభుత్వానికి తెలియవచ్చేలా నవదీప్ ప్రదర్శించిన సమయస్ఫూర్తిని అంతా కొనియాడుతున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*S Thaman: సాయి తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత బాధపడ్డానంటే..

**************************************

*Chandramukhi 2: రాజు వేషంలో లారెన్స్ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?

**************************************

*Brahmanandam: ఇదిగో సీఏం గారూ.. మా అబ్బాయి పెళ్లికి తప్పకుండా రావాలి

**************************************

*Sandeham: హెబ్బా పటేల్ ‘సందేహం’లో ‘చచ్చినా చావని ప్రేమిది’

**************************************

*Allu Aravind: డైరెక్టర్ మారుతి కుమార్తె టాలెంట్‌కి అల్లు అరవింద్ ఫిదా

**************************************

Updated Date - 2023-07-31T19:31:37+05:30 IST