Chandramukhi 2: రాజు వేషంలో లారెన్స్ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?

ABN , First Publish Date - 2023-07-31T15:51:09+05:30 IST

కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు దర్శకత్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని రాజు అవతారంలో ఉన్న లారెన్స్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Chandramukhi 2: రాజు వేషంలో లారెన్స్ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?
Raghava Lawrence in Chandramukhi2

కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘చంద్రముఖి 2’ (Chandramukhi2). బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు దర్శకత్వంలో రూపొందుతోంది. హార‌ర్ జోన‌ర్‌లో స‌రికొత్త సెన్సేష‌న్‌ను క్రియేట్ చేసిన ‘చంద్ర‌ముఖి’ (Chandramukhi) చిత్రానికి కొన‌సాగింపుగా దర్శకుడు పి. వాసు ఈ ‘చంద్రముఖి 2’ సినిమాను రూపొందిస్తున్నారు. సోమవారం ఈ సినిమా నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.


ఈ ఫస్ట్ లుక్‌ని గమనిస్తే... రాజు వేషంలో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నారు. ఆ లుక్‌లో పొగరు, రాజసంతో పాటు కూర్ర‌త్వం కూడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ఈ లుక్‌లోనే ఈ రేంజ్ ఉంటే సినిమాలో లారెన్స్ ఎలా త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటార‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతోన్న అంశం. లారెన్స్ మేకోవర్ కూడా ఆసక్తికరంగా ఉంది. అంతకు ముందు ఆయన చేస్తున్న ‘కాంచన’ సిరీస్ చిత్రాలలో ఉన్న హారర్ లుక్‌ని తలపిస్తుంది. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్ అంత ఇంపాక్ట్ అయితే లారెన్స్ రూపంలో రాలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

2005లో పి.వాసు ద‌ర్శక‌త్వంలో రూపొందిన ‘చంద్ర‌ముఖి’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై కూడా భారీగానే అంచనాలు నెలకొన్నాయి. భారీ బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ (Lyca Productions) నిర్మాత సుభాస్క‌ర‌న్ (Subaskaran) నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి (Vinayaka Chavithi) సంద‌ర్భంగా విడుద‌ల చేయనున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఎం.ఎం.కీర‌వాణి సంగీత బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Brahmanandam: ఇదిగో సీఏం గారూ.. మా అబ్బాయి పెళ్లికి తప్పకుండా రావాలి

**************************************

*Sandeham: హెబ్బా పటేల్ ‘సందేహం’లో ‘చచ్చినా చావని ప్రేమిది’

**************************************

*Allu Aravind: డైరెక్టర్ మారుతి కుమార్తె టాలెంట్‌కి అల్లు అరవింద్ ఫిదా

**************************************

Updated Date - 2023-07-31T15:51:09+05:30 IST