Mrunal Thakur: బర్త్‌డే స్పెషల్‌గా ‘హాయ్ నాన్న’ టీమ్ ఇచ్చిన ట్రీట్ ఇదే..

ABN , First Publish Date - 2023-08-01T16:45:00+05:30 IST

న్యాచురల్ స్టార్ నాని, నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో చేస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘హాయ్ నాన్న’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బర్త్‌డే పురస్కరించుకుని.. ఓ స్పెషల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Mrunal Thakur: బర్త్‌డే స్పెషల్‌గా ‘హాయ్ నాన్న’ టీమ్ ఇచ్చిన ట్రీట్ ఇదే..
Mrunal Thaku in Hi Nanna

న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani), నూతన దర్శకుడు శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వంలో చేస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ గ్లింప్స్ చివరిలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur).. హీరో నానిని ‘హాయ్ నాన్నా’ అని పిలవడం క్యురియాసిటీని పెంచింది. ఈ గ్లింప్స్ చూడడానికి అందంగా ఉండటంతో పాటు.. మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. అలాగే నాని, మృణాల్‌ల రిలేషన్ సినిమాలో ఎలా ఉండబోతుందనేది తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది.


మంగళవారం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు (ఆగస్ట్ 01) (Mrunal Thakur Birthday Special). ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మృణాల్ ఇందులో ఆకర్షణీయమైన చిరునవ్వుతో కనిపించగా, నాని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించారు. చెవిపోగులు, ముక్కుపుడక ధరించి.. మోడిష్ లుక్‌‌లో మృణాల్ ఆకట్టుకుంటోంది.

Hi-Nanna.jpg

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ (Vyra Entertainments) పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌కి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, సాను జాన్ వరుగీస్ ISC సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Navdeep: స్వామీ.. నదికి పోలేదా? అంటే.. ‘నదే సిటీకి వచ్చింది’ అంటూ ప్రభుత్వంపై పంచ్

**************************************

*S Thaman: సాయి తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత బాధపడ్డానంటే..

**************************************

*Chandramukhi 2: రాజు వేషంలో లారెన్స్ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?

**************************************

Updated Date - 2023-08-01T16:45:00+05:30 IST