Taraka Ratna: ఓబుతో చివరిసారి ఇలా.. కూతురి ఎమోషనల్ వీడియో వైరల్

ABN , First Publish Date - 2023-03-24T13:33:39+05:30 IST

గత కొన్ని రోజుల క్రితం నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) మరణం నందమూరి కుటుంబంతో పాటు ఆ కుటుంబ అభిమానులను సైతం శోకసంద్రంలో ముంచింది.

Taraka Ratna: ఓబుతో చివరిసారి ఇలా.. కూతురి ఎమోషనల్ వీడియో వైరల్
Tarakaratna

గత కొన్ని రోజుల క్రితం నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) మరణం నందమూరి కుటుంబంతో పాటు ఆ కుటుంబ అభిమానులను సైతం శోకసంద్రంలో ముంచింది. ముఖ్యంగా తారకరత్నే జీవితంగా బతుకుతున్న అలేఖ్యా రెడ్డి (Alekhya Reddy), ఆయన ముగ్గురి పిల్లల జీవితాలను కుదిపేసింది. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. తారకరత్న మరణించి ఇప్పటికే నెలరోజులు దాటిపోయాయి. భర్త మరణించి నెల రోజులైన కారణం ఆయనపై ప్రేమని వ్యక్తం చేస్తూ అలేఖ్య సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేసింది. (#Tarakaratna)

ఎన్ని కష్టాలను దాటుకుని వారిద్దరి పెళ్లి చేసుకుని, ప్రయాణం కొనసాగించారో అలేఖ్య రాసుకొచ్చింది. పెళ్లి తర్వాత వారిని వారి దగ్గరి బంధువులే దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే.. ఆపదలో ఆదుకున్న బాలకృష్ణకి ధన్యవాదాలు తెలిపింది. తాజాగా తారకరత్నకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోని ఆయన కూతురు నిష్క (Nishka)నే సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో.. తారకరత్న కూతురుతో కలసి గేమ్స్ ఆడుతున్నాడు. ఆ పోస్టుకి.. ‘గేమింగ్!!! హిందూపుర్‌కి వెళ్లే ముందు ఓబు’ అని రాసుకొచ్చింది. తండ్రి తారకరత్న, తల్లి అలేఖ్య యాష్ ట్యాగులతో పాటు బాలతాత అనే యాష్ ట్యాగ్‌ని కూడా ఇవ్వడం విశేషం. ఈ వైరల్ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఎమోషనల్ అవుతున్నారు. (Last video of Tarakaratna)

Taraka2.jpg

కాగా.. టీడీపీ నాయకులు నారా లోకేశ్‌ జనవరి 27న ‘యువగళం’ పాదయాత్రని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ పాదయాత్ర కొద్దిసేపు సాగిన తర్వాత తారకరత్న గుండెపోటుతో ఆకస్మికంగా కుప్పకూలారు. దీంతో అక్కడ ఉన్న కార్యకర్తలు ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఇచ్చినా ఆయన కోలుకోకపోవడంతో.. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. అక్కడే 23 రోజుల పాటు చికిత్స అందించనప్పటికీ ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 18న అందరినీ శోకసంద్రంలో ముంచుతూ తుదిశ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి:

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

Updated Date - 2023-03-24T13:34:43+05:30 IST