VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-03-15T21:50:54+05:30 IST

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో

VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
VBVK OTT Release Date Out

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం కూడా కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఇప్పుడీ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు (OTT Release) సిద్ధమైంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ (Allu Aravind) స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ (GA2 Pictures) బ్యాన‌ర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రంతో మురళీ కిశోర్ అబ్బూరు (Murali Kishore Abburu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. కిరణ్ అబ్బవరం సరసన కశ్మీరా పరదేశి (Kashmira Pardeshi) హీరోయిన్‌గా నటించింది. నంబ‌ర్ నైబ‌ర్ కాన్సెప్ట్‌ ప్రధాన హైలెట్‌గా వచ్చిన ఈ చిత్రం వెండితెర ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఓటీటీ‌లో అలరించేందుకు ఉగాది కానుకగా.. మార్చి 22న ‘ఆహా’ (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఈ విషయం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. (Vinaro Bhagyamu Vishnu Katha Story)

హీరో విష్ణు(కిరణ్ అబ్బవరం) తిరుపతికి చెందిన కుర్రాడు. హైదరాబాద్‌లోని ఓ లైబ్రరీలో పని చేస్తూ ఉంటాడు. తాతకి ఇచ్చిన మాట ప్రకారం ఎవరు కష్టంలో ఉన్నా.. సాయం చేస్తుంటాడు. అలాంటి కుర్రాడికి దర్శన (కాశ్మీర పర్దేసి) అనే ఒక యూట్యూబర్ పరిచయం అవుతుంది. ఆమె పాపులర్ అవటం కోసం నెంబర్ నైబర్స్ అని.. తన ఫోన్ నెంబర్‌కి ఒక అంకె ముందు, వెనకాల నంబర్స్‌కి ఫోన్ చేసి.. వాళ్ళతో పరిచయం పెంచుకుని వీడియోలు తీస్తుంటుంది. అలా కలిసిన నెంబర్స్ వాళ్ళే విష్ణు మరియు శర్మ (మురళి శర్మ). ఇలా ఈ ముగ్గురూ కలిసి వీడియోస్ చేస్తూ పాపులర్ అవుతుంటారు. అదే సమయంలో దర్శనని విష్ణు ప్రేమిస్తుంటాడు. మరో వైపు శర్మ కూడా దర్శనను ప్రేమిస్తాడు. ఇద్దరితోనూ సన్నిహితంగా ఉండే దర్శన.. ఒకరోజు ప్రాంక్ వీడియో చేసి విష్ణుకి చూపించాలని శర్మను రివాల్వర్‌తో షూట్ చేస్తుంది. అయితే ప్రాంక్ అనుకుంటే.. నిజంగానే శర్మ మరణిస్తాడు. శర్మ ఎలా చనిపోయాడు? దర్శన నిర్దోషి అని తెలిసిన విష్ణు.. ఆమెను విడిపించేందుకు ఏం చేశాడు? ముంబై గ్యాంగ్‌స్టర్ రాజన్ (శరత్ లోహితస్వ) తిరుపతి ఎందుకు వచ్చాడు? అతనికి, విష్ణుకు ఉన్న సంబంధం ఏమిటి?.. వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమే ‘వినరో భాగ్యము విష్ణు కథ’. (VBVK OTT Release Date Out)

వెండితెర వీక్షకులను ఆహ్లాదపరిచి.. విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో ఎటువంటి రిజల్ట్‌ని సాధిస్తుందో.. తెలియాలంటే మార్చి 22 వరకు వెయిట్ చేయక తప్పదు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన తదుపరి చిత్రం ‘మీటర్’ (Meter) ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి

*Chiranjeevi: సినీ నటుడు చిరంజీవికి హైకోర్టులో ఎదురుదెబ్బ..

*PVT04: మెగా హీరోని ఢీ కొట్టబోతోంది ఎవరో తెలుసా?

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Thammareddy Bharadwaja: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవార్డ్.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?

*Ram Charan: ఉపాసనని, ఆమె మెడలోని నగని కాపాడుకోవాలి

*Talasani: ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్.. BJP ప్రభుత్వానికి ఇది గుణపాఠం

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-15T21:50:54+05:30 IST