Vairam: హీరోగా విలన్ దేవరాజు కుమారుడు.. టీజర్ కూడా వదిలారు

ABN , First Publish Date - 2023-03-18T20:57:58+05:30 IST

‘20వ శతాబ్ధం, ప్రేమయుద్ధం, యజ్ఞం, యోగి, ఎవడైతే నాకేంటి, భరత్ అనే నేను’ వంటి చిత్రాలలో నటించిన విలన్ దేవరాజు (Devaraj) కుమారుడు హీరోగా..

Vairam: హీరోగా విలన్ దేవరాజు కుమారుడు.. టీజర్ కూడా వదిలారు
Vairam Teaser Launch Event

‘20వ శతాబ్ధం, ప్రేమయుద్ధం, యజ్ఞం, యోగి, ఎవడైతే నాకేంటి, భరత్ అనే నేను’ వంటి చిత్రాలలో నటించిన విలన్ దేవరాజు (Devaraj) కుమారుడు ప్రణం దేవరాజ్ (Pranam Devaraj) హీరోగా పరిచయం అవుతున్నాడు. యువాన్స్ నాయుడు సమర్పణలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి పిక్చర్, సంస్కృతి ప్రొడక్షన్స్, సర్తాక్ పిక్చర్స్ బ్యానర్స్ పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి ‘వైరం’ (Vairam) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సాయి శివం జంపాన (Sai Shivam Jampana) దర్శకత్వంలో జె. మల్లికార్జున (J. Mallikarjuna) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి బ్యానర్ లోగోను దేవరాజ్, చంద్ర దేవరాజ్ విడుదల చేయగా.. టీజర్‌ను నటులు బెనర్జీ, కాశీ విశ్వనాధ్ విడుదల చేశారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సీనియర్ నటుడు దేవరాజ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్న నా కొడుకును కూడా అదే విధంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శకుడు చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా టీజర్‌కు కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు టీజర్‌కు కూడా అంతే బాగుందని అంతా అంటుంటే సంతోషంగా ఉంది. నిర్మాత మల్లికార్జునకు ఈ సినిమాతో మంచి పేరు తెస్తుంది. ‘KGF’ వంటి సినిమాలో నటించిన గరుడ రామ్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. (Vairam Teaser Launch)

చిత్ర దర్శకుడు సాయి శివన్ జంపాన మాట్లాడుతూ.. తెలుగు, కన్నడలో బైలింగ్వేల్ సినిమా చేశాము. కన్నడలో మంచి హీరో అయిన ప్రజ్వల్ దేవరాజ్‌కు, హీరో ప్రణం దేవరాజ్‌కు, సీనియర్ నటులు దేవరాజ్‌గారికి నేను చెప్పిన కథ నచ్చింది. నిర్మాత ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత జె. మల్లికార్జున మాట్లాడుతూ.. దర్శకుడు సాయి చెప్పిన కథ నచ్చడంతో ఈ కథను దేవరాజ్‌గారికి చెప్పడం జరిగింది. మా స్టోరీని నమ్మి మాకు అవకాశం ఇచ్చిన దేవరాజ్‌కు, తనయుడు ప్రణం దేవరాజ్‌కు ధన్యవాదములు. ప్రణం ఇందులో బాగా చేశాడు. ప్రతి ఒక్కరూ ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా బాగా వచ్చింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. (Vairam Movie)

ఇవి కూడా చదవండి:

*********************************

* Akhil Akkineni: పెళ్లిపై అఖిల్ అక్కినేని సంచలన వ్యాఖ్యలు

*Singer Sunitha: చాలా బరువుగా ఉంది.. అయినా హాయిగా ఉంది

*NTR30: ఇలా అయితే సినిమాలు మానేస్తా.. ఫ్యాన్స్‌కి స్వీట్ వార్నింగ్

*Young Tiger NTR: విశ్వక్ సేన్ దర్శకత్వం మానేయాలని కోరుకుంటున్నా..

*Jr NTR: ఆస్కార్ క్రెడిట్ ఎవరిదంటే.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్

*Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

Updated Date - 2023-03-18T21:03:04+05:30 IST