Saindhav: విస్ఫోటనం ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-03-29T19:04:50+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరోల్లో వెంకటేశ్ (Venkatesh) ఒకరు. కొత్త రకం కథలు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. వెంకీ తాజాగా శైలేశ్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో నటిస్తున్నారు. ‘సైంధవ్’ (Saindhav) లో టైటిల్ రోల్ చేస్తున్నారు.

Saindhav: విస్ఫోటనం ఎప్పుడంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో వెంకటేశ్ (Venkatesh) ఒకరు. కొత్త రకం కథలు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. వెంకీ తాజాగా శైలేశ్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో నటిస్తున్నారు. ‘సైంధవ్’ (Saindhav) లో టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ మధ్యనే పట్టాలెక్కింది. శర వేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. క్రిస్‌మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు చెప్పారు.

Saindhav.jpg

‘సైంధవ్’ ను నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. పాన్ ఇండియాగా నిర్మిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ చెప్పింది. ‘హిట్’ ప్రాంచైజీ తర్వాత శైలేశ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కు చోటుందని సమాచారం. శ్రీ నిధి శెట్టి (Srinidhi Shetty), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) ఆ పాత్రలను చేయనున్నారని తెలుస్తోంది. మూడో హీరోయిన్‌ను త్వరలోనే ఎంపిక చేస్తారని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి.

వెంకటేశ్ చివరగా ‘ఎఫ్ 3’ లో కనిపించారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ‘ఓరి దేవుడా’ లో అతిథి పాత్రను పోషించారు. దేవుడిగా కనిపించారు. ప్రస్తుతం ‘సైంధవ్’ లో నటిస్తున్నారు. వెంకీ ఈ చిత్రంలో మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. శైలేశ్ కొన్ని రోజుల క్రితమే ‘హిట్: 2’ తో బంపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ లాభాలను పంచింది. అందువల్ల ‘సైంధవ్’ పై భారీ అంచనాలున్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-29T19:14:05+05:30 IST