Tamannaah Bhatia: బాలీవుడ్ హీరోతో ప్రేమాయణంపై స్పందించిన నటి

ABN , First Publish Date - 2023-03-12T19:55:23+05:30 IST

చిన్నతనంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తమన్నా భాటియా (Tamannaah Bhatia). భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమల్లో చిత్రాలు చేశారు.

Tamannaah Bhatia: బాలీవుడ్ హీరోతో ప్రేమాయణంపై స్పందించిన నటి

చిన్నతనంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తమన్నా భాటియా (Tamannaah Bhatia). భాషతో సంబంధం లేకుండా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని పరిశ్రమల్లో చిత్రాలు చేశారు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) తో తమన్నా ప్రేమాయణం కొనసాగిస్తున్నారని కొన్ని రోజులుగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. విజయ్ వర్మ కూడా పరోక్షంగా మిల్కీబ్యూటీని ఉద్దేశించి పోస్ట్‌లు పెడుతుండటంతో ఆ వదంతులకు మరింత బలం చేకూరినట్లైంది. తాజాగా తమన్నా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రూమర్స్‌పై స్పందించారు.

‘‘మేం ఇద్దరం కలసి ఒక వెబ్‌సిరీస్ చేశాం. ఫలితంగా ఇటువంటి రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదు. అంతకన్నా ఎక్కువగా నేను ఏం చెప్పలేను. నాపై ఇలా వదంతులు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. రియల్ లైఫ్‌లో ఏడడుగులు వేసే సమయానికి హీరోయిన్స్‌కు అనేక సార్లు పెళ్లి జరుగుతుంది. నాకు చాలా సార్లు డాక్టర్, బిజినెస్ మ్యాన్ వంటి భాగస్వాములను అంటగట్టారు. ఇప్పటికే అనేక సార్లు పెళ్లి జరిగినట్టు నాకు అనిపిస్తుంది. దాంపత్య జీవితం మొదలు పెట్టే సమయానికి నిజంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు’’ అని తమన్నా తెలిపారు.

కొన్ని రోజుల క్రితం తమన్నా, విజయ్ వర్మ బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటూ మీడియా కంటపడ్డారు. అప్పటి నుంచి ఈ జంట ప్రేమించుకుంటున్నారని రూమర్స్ షికార్లు కొట్టడం మొదలయ్యాయి. తమన్నా, విజయ్ జంటగా ‘లస్ట్ స్టోరీస్ 2’ (Lust Stories 2) లో నటించారు. ఈ వెబ్‌సిరీస్‌కు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఈ షో షూటింగ్ జరగుతున్నప్పుడే వీరికి పరిచయం ఏర్పడిందట. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Sharon Stone: శృంగార చిత్రం చేయడంతో నా కుమారుడు దూరమయ్యాడు

Comedian Raghu: జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్.. ఆయన జోలికేస్తే ప్రాణాలు తీస్తా..

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-12T19:55:25+05:30 IST