Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

ABN , First Publish Date - 2023-03-10T16:40:51+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పవర్ స్టార్ ఈ మధ్యనే కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించారు.

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పవర్ స్టార్ ఈ మధ్యనే కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ‘వినోదాయ సీతం’ (Vinodhaya Sitham) రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ (SaI Dharam Tej) కీలక పాత్ర పోషిస్తున్నారు. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

‘వినోదాయ సీతం’ కోసం పవన్ కల్యాణ్ 25రోజుల పాటు డేట్స్ కేటాయించారని సమాచారం అందుతుంది. ఆయనకు సంబంధించిన భాగాన్ని మార్చి చివరి లోపు పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ 25రోజులకు గాను మేకర్స్ పవన్ కల్యాణ్‌కు రూ.75కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. అంటే ఒక్క రోజు కోసం పవన్ దాదాపుగా రూ.3కోట్లను ఛార్జ్ చేశారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలసి నిర్మిస్తున్నాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రి విక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రీకరణను 60శాతానికి పైగా పూర్తి చేశారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. మరో మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.


^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Jr NTR: ధనుష్, వెట్రిమారన్‌ సినిమాపై తారక్ క్లారిటీ..

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-10T17:42:23+05:30 IST