Sharon Stone: శృంగార చిత్రం చేయడంతో నా కుమారుడు దూరమయ్యాడు

ABN , First Publish Date - 2023-03-12T19:13:09+05:30 IST

‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ (Basic Instinct) సినిమాతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న నటి షరాన్ స్టోన్ (Sharon Stone). ఈ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్‌ను ఆమె సొంతం చేసుకున్నారు.

Sharon Stone: శృంగార చిత్రం చేయడంతో నా కుమారుడు దూరమయ్యాడు

‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ (Basic Instinct) సినిమాతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న నటి షరాన్ స్టోన్ (Sharon Stone). ఈ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. శృంగార తారగా పేరు సంపాదించుకున్నారు. కానీ, షరాన్ ఈ మూవీ చేయడంతోనే కుమారుడికి దూరం కావాల్సి వచ్చిందని చెప్పారు.

షరాన్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకున్నారు. భర్త ఫిల్‌ బ్రోన్‌స్టెయిన్‌ (Phil Bronstein) నుంచి విడాకులు కోరుతూ 2000 సంవత్సరంలో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్న అత్యంత విచారకరమని చెప్పారు. అదే తన కుమారుడిని తనకు దూరం చేసిందని తెలిపారు. ‘‘నా దగ్గర పెరగాల్సిన కుమారుడు నాకు దూరమయ్యాడు. కోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తి చిన్నవాడైన నా కుమారుడిని ‘మీ అమ్మ శృంగార సినిమాలు చేస్తారని నీకు తెలుసా’ అని అడిగారు. ఆ సినిమా చేయడంతో నా వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ టీవీ షోస్‌లో నటీ, నటులు నగ్నంగా దర్శనమిస్తున్నారు. వాటితో పోలిస్తే నా పదహారు సెకన్ల న్యూడ్‌ వీడియో ఏపాటిది’’ అని షరాన్ స్టోన్ పేర్కొన్నారు.

‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ సినిమాతో తనుకు భాగస్వాములు కూడా దూరమయ్యారని షరాన్ స్టోన్ చెప్పారు. గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల సందర్భంగా అవహేళనకు గురయ్యానని ఆమె అన్నారు. ‘‘నేను గోల్డెన్ గ్లోబ్‌ పురస్కారానికి నామినేట్ అయ్యాను. పురస్కారం అందుకోవడం కోసం వెళ్లాను. నా పేరు పిలవగానే గదిలోని కొంతమంది పగలబడి నవ్వారు. ఆ సమయంలో నాకు అవమానంగా అనిపించింది. ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ లోని నా పాత్ర అన్ని పరిధులను చెరిపేసింది’’ అని షరాన్ వెల్లడించారు. ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ అప్పట్లో సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద 300మిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Comedian Raghu: జూనియర్ ఎన్టీఆర్ నా బాడీలో ఓ పార్ట్.. ఆయన జోలికేస్తే ప్రాణాలు తీస్తా..

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-12T19:13:16+05:30 IST