Srikanth Odela: హీరోయిన్ పాత్రకు కీర్తిసురేశ్ నో అనడంతోనే సంతోషించాను

ABN , First Publish Date - 2023-03-29T20:47:53+05:30 IST

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన సినిమా ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరోయిన్ పాత్రను పోషించారు. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించింది.

Srikanth Odela: హీరోయిన్ పాత్రకు కీర్తిసురేశ్ నో  అనడంతోనే సంతోషించాను

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన సినిమా ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్ (Keerthy Suresh) హీరోయిన్ పాత్రను పోషించారు. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహించారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించింది. పాన్ ఇండియాగా రూపొందించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు.

Dasara.jpg

‘‘ఈ కథను మొదట నానికి వినిపించాను. ఆయన హీరోయిన్‌గా కీర్తి సురేశ్ పేరును సూచించారు. ఇద్దరు స్టార్స్‌ను డీల్ చేయడం కష్టమని ఆమెకు నో చెప్పాను. తెలుగమ్మాయితే బాగా ఉంటుందనుకున్నాను. అందు కోసం బాగా వెతికాను. ఏడు, ఎనిమిది నెలలు వెతికినప్పటికీ తెలుగమ్మాయి ఎవరు దొరకలేదు. ఫలితంగా కీర్తి సురేశ్‌కు కథను వినిపించాను. ఆమె తొలిసారి కథ విని రిజెక్ట్ చేశారు. ఆమెకు కథను వినిపిస్తున్నప్పుడు అంగీకరిస్తుందోమోనని చాలా భయపడ్డాను. కానీ, ఆమె నో చెప్పడంతోనే చాలా సంతోషించాను. అదే విషయం నానికి కూడా చెప్పాను. కథ అర్థం కాలేదని అందుకే అంగీకరించలేదని కీర్తి తెలిపారు. మరోసారి ట్రాన్స్‌లేటర్ సహాయంతో కథను వింటనన్నారు. ఈ సారి స్టోరీని విని ఆమె అంగీకరించారు. తొలిరోజు షూటింగ్‌లో భాగంగా పేడ కలపమని చెప్పాను. ఆమె ఆ షాట్ చేయడానికి అంగీకరించడంతోనే నాకు చాలా ఉత్సాహం వచ్చింది. ఏ షాట్ అయిన కీర్తితో చేయించుకోవచ్చని అప్పుడు నాకు అర్థమైంది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి పోయాక వెన్నెల పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాను. అదే విషయం ఆమెకు కూడా చెప్పాను’’ అని శ్రీకాంత్ ఓదెల చెప్పారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Dasara: నాని ఇగోను హర్ట్ చేసిన డైరెక్టర్

SS. Karthikeya: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెన్ ఖర్చు బయట పెట్టిన కార్తికేయ

Pooja Hegde: లక్కీ ఛాన్స్ కొట్టేసిన అందాల భామ!

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-29T20:52:40+05:30 IST