సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..

ABN, First Publish Date - 2023-03-25T11:07:23+05:30

గత కొంతకాలంగా టాలీవుడ్ యువ నటుడు నాని (Nani) వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొంతకాలంగా టాలీవుడ్ యువ నటుడు నాని (Nani) వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఏం మాట్లాడినా.. అది కాంట్రవర్సీ అయ్యి.. కొత్త వివాదానికి తెరతీస్తోంది. ఈ విషయంపై తాజాగా నాని స్పందించాడు. తాను ఏం మాట్లాడినా సమస్యే అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నాని తాజాగా ‘దసరా’ (Dasara) అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న విషయం విదితమే. ఈ శ్రీకాంత్ ఓదేలా అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీలో కీర్తీ సురేశ్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ తరుణంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ.. మూవీ టీం జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న వివాదాలపై నాని మాట్లాడాడు.

నాని మాట్లాడుతూ.. ‘నాకు ఇటీవలికాలంలో చాలా సమస్యలు వచ్చాయి. నా నోటి నుంచి చాలా క్యాజువల్‌గా వచ్చిన మాటలే పెద్ద వివాదాలకు కారణమైయ్యాయి. దానికి గురించి మాట్లాడితే మరో వివాదానికి కారణమవుతుందేమోనని అనుమానంగా ఉంది. శ్యామ్‌ సింగరాయ్‌ చిత్ర విడుదల సమయంలో టికెట్‌ ధరల గురించి మాట్లాడాను. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని నా విమర్శలు చేశారు. ప్రతి పదానికి పెడర్థాలు తీసుకుని అలా ఎందుకు మాట్లాడుతున్నారని అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు. (Nani Reacts To controversies)

అలాగే సుకుమార్ కాంట్రవర్సీ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ గురించి కూడా నేను పాజిటివ్‌గా చెప్పిన విషయాలకి కాంట్రవర్సీ చేశారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడాను. అప్పుడే ఓ రిపోర్టర్.. ‘చాలామంది అగ్రదర్శకులతో పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తుంటే మీరెందుకు కొత్త డైరెక్టర్లతో ముందుకు వెళ్తున్నారు?’ అని అడిగాడు. దానికి.. ‘టాలీవుడ్‌లో పాపులారిటీ ఉన్న దర్శకులు వేరే ఇండస్ట్రీలో మాత్రం కొత్తవారే కదా. పుష్ప మూవీ సమయంలో సుకుమార్ కూడా ఇతర పరిశ్రమలకి కొత్తవారే. ఆ తర్వాత అక్కడ ఆయని పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర దర్శకుడు కూడా కొత్తవాడే కానీ.. తర్వాత పేరు సంపాదించుకుంటాడు’ అని చెప్పా. ఇందులోనూ తప్పు తీసి నా విమర్శలు చేస్తున్నారు’ అని నాని ఆవేదన చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

Updated Date - 2023-03-25T11:07:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!