LEO Video Viral: మైనస్ 8 డిగ్రీల టెంపరేచర్‌లో షూటింగ్.. ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

ABN , First Publish Date - 2023-03-25T08:51:18+05:30 IST

గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘విక్రమ్’ (Vikram) ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే.

LEO Video Viral: మైనస్ 8 డిగ్రీల టెంపరేచర్‌లో షూటింగ్.. ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?
LEO

గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘విక్రమ్’ (Vikram) ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఈ మూవీతో తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ (Lokesh Kanagaraj)కి ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ని తీసుకొచ్చింది. అలాగే.. చాలా సినిమాలతో తరువాత లోకనాయకుడు కమల్ హాసన్‌కి ఈ మూవీతో సరైన హిట్ దక్కింది. అంతేకాకుండా.. ఈ సినిమాతో ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ (Lokesh Cinematic Universe) ప్రారంభం కావడంతో.. ఈ మూవీలో సూర్య విలన్‌గా నటించడం.. తర్వాత కూడా పలువురు స్టార్ హీరోలు ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కానుండడంతో.. తర్వాతి సినిమాలపై చాలా క్రేజ్ ఏర్పడింది.

ఈ తరుణంలోనే LCUలో భాగంగా తమిళ నటుడు విజయ్‌ (Vijay)తో లోకేశ్ ‘లియో’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్ర టీజర్‌ని ఇటీవలే మూవీ టీం విడుదల చేయగా.. అది రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోయింది. కాగా.. ఈ సినిమా తాజాగా షెడ్యూల్ జమ్మూ-కశ్మీర్‌ షెడ్యూల్‌ జరిగింది. దాదాపు 50 రోజుల వరకు చాలా క్లిష్ట పరిస్థితుల్లో జరిగిన ఈ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. ఈ షూటింగ్‌కు సంబంధించి ఓ వీడియోని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఆ వీడియోలో చిత్రం వెనుక పని చేసే టీం ఎంత కష్టపడిందో ఓ డాక్యుమెంటరీ తరహాలో చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.

leo.jpg

ఆ వీడియోలో.. తెల్లవారు జామున -8 లేదా -5 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండొచ్చు.. ఆ సమయంలో తేచి పనులు ప్రారంభించేవారమని చిత్రబృందం సభ్యులు తెలిపారు. కొన్ని సార్లైతే ముక్కు నుంచి రక్తం వచ్చేదని వారు చెప్పారు. అలాగే.. షూటింగ్‌కి నైట్‌ టైమే అనుకూలంగా ఉండేదని పేర్కొన్నారు. ఓ వైపు మంచు.. ఓ వైపు వర్షం.. రోడ్లు జారుతుండడంతో చాలా జాగ్రత్తగా షూటింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ‘ఈ షూటింగ్ సమయంలోనే ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌కి పెళ్లైంది. అయినా రెండు రోజులకే షూటింగ్‌కి వచ్చేశాడు. అలాగే.. ఫొటోగ్రాఫర్ తల్లి చనిపోతే అంత్యక్రియలు పూర్తి చేసి రెండు రోజుల్లోనే తిరిగి వచ్చేశాడు. ఇంకోరైతే.. బిడ్డ పుట్టిన షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు చూడటానికి వెళ్లలేదు’ అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన పలువురు.. ఈ సినిమా వెనుక ఇంత కష్టముంటుందా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

Updated Date - 2023-03-25T09:01:35+05:30 IST