Mani Sharma: అలాంటి వారిని మనం కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2023-07-19T23:09:07+05:30 IST

దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. జూలై 21న ఈ సినిమా విడుదల కాబోతోన్న సందర్భంగా చిత్రయూనిట్‌కు మణిశర్మ శుభాకాంక్షలు తెలిపారు.

Mani Sharma: అలాంటి వారిని మనం కాపాడుకోవాలి
Ala Ila Ela Movie team with Mani Sharma

దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ (Shakti Vasudevan) హీరోగా రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎస్.కె.ఎం.ఎల్. మోషన్ పిక్చర్స్ సంస్థ ద్వారా జూలై 21 న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మెలోడి బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) తన బెస్ట్ విషెశ్‌ను చిత్రయూనిట్‌కు అందించారు.


ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ.. ‘‘నిర్మాత (Producer) అనే వాడు ఓ చెట్టులాంటి వాడు. అలాంటి నిర్మాతను మనం కాపాడుకోవాలి. వందల మందికి పనిని కల్పిస్తుంటారు. రాఘవ మంచి దర్శకుడు. ఇందులో నాలుగు పాటలుంటాయి. అలాంటి పాటలను నేను కూడా ఇంత వరకు ప్రయోగించలేదు. సిరివెన్నెల గారు మూడు పాటలు, భాస్కర భట్ల‌గారు ఒక పాటను రాశాను. సినిమాను అందంగా తీశారు. మా దర్శక నిర్మాతలకు మంచి సక్సెస్ రావాలి. ‘అలా ఇలా ఎలా’ (Ala Ila Ela) జూలై 21 న విడుదల కాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Leo: మైత్రీ మూవీ మేకర్స్ బాటలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫస్ట్ సినిమా ‘లియో’నే!

**************************************

*Bro: షాకింగ్ నిర్ణయం తీసుకున్న నిర్మాతలు.. ఫ్యాన్స్‌కు నిరాశే ‘బ్రో’!

**************************************

*Klin Kaara: మెగా ప్రిన్సెస్‌కు తారక్ పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. ఎవరూ ఊహించి కూడా ఉండరు

**************************************

*Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’ విషయం బయటపెట్టేసింది

**************************************

*Project K: రెబల్‌స్టార్ ప్రభాస్ లుక్ వచ్చేసిందోచ్..

**************************************

*Sai Rajesh: ‘బేబీ’ కథ చెప్పడానికి వెళితే.. దర్శకుడిని అవమానించిన హీరో ఎవరు?

**************************************

Updated Date - 2023-07-19T23:09:07+05:30 IST