CCL 2023: మరోసారి విజేతగా నిలిచిన తెలుగు వారియర్స్‌.. ఎన్నిసార్లు కప్ గెలిచిందంటే..

ABN , First Publish Date - 2023-03-26T08:56:50+05:30 IST

ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (IPL) తరహాలోనే 2011లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

CCL 2023: మరోసారి విజేతగా నిలిచిన తెలుగు వారియర్స్‌.. ఎన్నిసార్లు కప్ గెలిచిందంటే..
CCL

ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (IPL) తరహాలోనే 2011లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది కేవలం నాలుగు జట్లు మాత్రమే ఆ టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి. అయితే.. 2023 జరిగిన ప్రస్తుత లీగ్‌లో ఎనిమిది జట్లకి చేరింది. ఈ లీగ్‌లో మరోసారి తెలుగ వారియర్స్ విజేతగా నిలిచింది.

విశాఖపట్నంలోని ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్ టీమ్‌ని ఓడించి.. తెలుగు వారియర్స్ టైటిల్‌ని కైవసం చేసుకుంది. గత మ్యాచులలాగే ఇందులోనూ తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని అదరగొట్టాడు.

ccl2.jpg

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ (Telugu Warriors) టీమ్ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కి దిగిన భోజ్‌పురి దబాంగ్స్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 72 చేసింది. తర్వాత అఖిల్‌ 32 బంతుల్లో 67 పరుగులు చేయడంతో తెలుగు వారియర్స్‌ 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భోజ్‌పురి దబాంగ్స్ 6 వికెట్లు నష్టానికి 89 పరుగులే చేయగలిగింది. దీంతో తెలుగు వారియర్స్ ముందు 58 పరుగుల లక్ష్యం ఉంచింది. ఆ లక్ష్యాన్ని కేవలం వికెట్ నష్టపోయి తెలుగు వారియర్స్ సాధించింది.

ccl.jpg

ఈ టైటిల్‌ని గెలవడం తెలుగు వారియర్స్‌కి ఇది నాలుగో సారి కావడం విశేషం. ఎక్కువ టైటిల్స్ గెలిచిన టీమ్‌గా రికార్డ్ సృష్టించింది. ఇంతకుముందు 2015, 2016, 2017లో వరుసగా గెలిచి తెలుగు వారియర్స్ హ్యట్రిక్ టైటిల్స్ సాధించింది. కాగా, అనంతరం కరోనా కారణంగా మూడేళ్లు గ్యాప్ వచ్చింది. కాగా.. ఈ లీగ్‌లో ఫైన‌ల్‌కి చేరేవరకు భోజ్‌పురి దబాంగ్స్ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకపోవడం విశేషం. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా అఖిల్‌ నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?

Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం

Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..

NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

Updated Date - 2023-03-26T08:56:52+05:30 IST