Bhagavanth Kesari: ఏంటి.. ఊపిరి ఆడనివ్వరా.. అసలీ అప్‌డేట్స్ ఏంటి? అస్సలు తగ్గట్లేదుగా..

ABN , First Publish Date - 2023-10-07T23:50:49+05:30 IST

ఈ దసరాకి రాబోతోన్న చిత్రాల మధ్య నువ్వా? నేనా? అనేలా ఫైట్ ఉండబోతుందనేది.. ఆయా చిత్రాల ప్రమోషన్స్‌‌ను చూస్తుంటే తెలుస్తోంది. ముఖ్యంగా ఈ దసరా బరిలో ఉన్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మించిన ‘భగవంత్ కేసరి’ చిత్ర ప్రమోషన్స్ అయితే మాములుగా లేవు. తాజాగా ఈ సినిమా నుంచి కాజల్, అర్జున్ రాంపాల్ లుక్‌ని మేకర్ష్ వదిలారు.

Bhagavanth Kesari: ఏంటి.. ఊపిరి ఆడనివ్వరా.. అసలీ అప్‌డేట్స్ ఏంటి? అస్సలు తగ్గట్లేదుగా..
Balakrishna in Bhagavanth Kesari

ఈ దసరాకి రాబోతోన్న చిత్రాల మధ్య నువ్వా? నేనా? అనేలా ఫైట్ ఉండబోతుందనేది.. ఆయా చిత్రాల ప్రమోషన్స్‌‌ను చూస్తుంటే తెలుస్తోంది. ముఖ్యంగా ఈ దసరా బరిలో ఉన్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా, అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) చిత్ర ప్రమోషన్స్ అయితే మాములుగా లేవు. అసలు ఫ్యాన్స్ ఊపిరి ఆడనివ్వకుండా అప్‌డేట్స్ వదులుతూనే ఉన్నారు. ఇప్పటికే చిత్రయూనిట్ నుంచి ఆదివారం ట్రైలర్ అంటూ ఓ బ్లాస్టింగ్ అప్‌డేట్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోన్న కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) లుక్‌ను, అలాగే బాలయ్య పోటీగా నిలబడబోతోన్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ (Arjun Rampal) లుక్‌ను వదిలి.. మేకర్స్ డబుల్ ట్రీట్ ఇచ్చారు.

Kajal.jpg

కాత్యాయని‌ (Katyayani)గా కాజల్ అగర్వాల్‌ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ట్రెడిషినల్ వేర్‌లో బ్యూటిఫుల్ స్మైల్‌తో ఆకట్టుకుంటోంది. అర్జున్ రాంపాల్ లుక్ విషయానికి వస్తే.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అర్జున్ రాంపాల్ డిజైనర్ వేర్‌లో సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నప్పటికీ, తన ఇంటెన్స్ లుక్స్‌తో భయపెడుతున్నారు. రాహుల్ సంఘ్వీ (Rahul Sanghvi)గా టెర్రిఫిక్ లుక్‌లో సింహాసనంపై కూర్చున్న అర్జున్ రాంపాల్ రాయల్ వైబ్స్ క్రియేట్ చేశారు. ఈ రెండు లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ పోస్టర్స్‌పై ట్రైలర్‌ను రివీల్ చేసే సమయాన్ని కూడా మేకర్స్ ప్రకటించారు. ‘భగవంత్ కేసరి’ థియేట్రికల్ ట్రైలర్ ఆదివారం రాత్రి 8గంటల 16 నిమిషాలకు విడుదల కానుంది. (Bhagavanth Kesari Trailer Time)


Arjun-Rampal.jpg

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతీది ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. రాబోయే ట్రైలర్‌పై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్, యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. (Bhagavanth Kesari Release Date)


ఇవి కూడా చదవండి:

============================

*Jagapathi Babu: అభిమానం, ప్రేమ కంటే ఆశించడం ఎక్కువైందంటూ జగ్గు భాయ్ షాకింగ్ డెసిషన్

********************************************************

*Mangalavaaram: ‘ఏమయ్యిందో ఏమిటో..’.. పాయల్ రాజ్‌పుత్ ఆగమాగం

**************************************

*Bubblegum: సుమక్క కొడుకు హీరోగా అరంగేట్రం.. దర్శకధీరుడు ఏం చేశారంటే..

**************************************

*Pawan Kalyan: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు

*********************************

*Tiger Nageswara Rao: సైన్ లాంగ్వేజ్‌లో కూడా.. ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతోనే రవితేజ రికార్డ్

********************************

*Mad: ‘మ్యాడ్’ బొమ్మకి హిట్ టాక్.. సంతోషంలో యూనిట్..

********************************

Updated Date - 2023-10-08T00:02:56+05:30 IST