Bubblegum: సుమక్క కొడుకు హీరోగా అరంగేట్రం.. దర్శకధీరుడు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2023-10-06T21:57:42+05:30 IST

స్టార్ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా అరంగేట్రం చేయబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు రావడం, మూవీ ప్రారంభమవడం వంటివి జరిగిన విషయం తెలిసింతే. తాజాగా రోషన్ కనకాల హీరోగా చేస్తున్న ‘బబుల్‌గమ్’ చిత్ర ఫస్ట్ లుక్‌ని దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Bubblegum: సుమక్క కొడుకు హీరోగా అరంగేట్రం.. దర్శకధీరుడు ఏం చేశారంటే..
Roshan Kanakala and Maanasa Choudhary

స్టార్ యాంకర్ సుమ కనకాల (Suma Kanakala), నటుడు రాజీవ్ కనకాల (Rajeevi Kanakala) తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala) హీరోగా అరంగేట్రం చేయబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు రావడం, మూవీ ప్రారంభమవడం వంటివి జరిగిన విషయం తెలిసింతే. తాజాగా రోషన్ కనకాల హీరోగా చేస్తున్న చిత్ర ఫస్ట్ లుక్‌ని దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు ‘బబుల్‌గమ్’ (Bubblegum) అనే టైటిల్‌ని ఫిక్ష్ చేశారు.

ప్రైడ్ అఫ్ ఇండియన్ సినిమా ఎస్‌ఎస్ రాజమౌళి ఈ ‘బబుల్‌గమ్’ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసి.. ‘నటుడిగా అరంగేట్రం చేసినందుకు రోషన్‌కు అభినందనలు. రోషన్ తనకంటూ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక ముద్ర వేయాలి. రాజీవ్, సుమ‌గారు గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను. 🤗 అలాగే, బబుల్‌గమ్ టీమ్‌కి శుభాకాంక్షలు!’ అని ట్వీట్‌ చేశారు రాజమౌళి. ఈ ఎక్జయియిటింగ్ జెన్జీ లవ్ స్టోరీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది, ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. (Bubblegum First Look Out)


‘బబుల్‌గమ్’ సినిమాతో ఇద్దరు కొత్తవారు వెండితెరకు పరిచయం అవుతున్నారు. వారే రోషన్ కనకాల, మానస చౌదరి (Maanasa Choudhary). వారిద్దరూ ఈ ఫస్ట్ లుక్‌లో తళుక్కున మెరుస్తూ, తమ చార్మ్‌తో వీక్షకులని కట్టిపడేశారు. రోషన్ కనకాల గిరజాల జుట్టు, లేత గడ్డంతో పోస్టర్‌లో అందంగా కనిపిస్తున్నాడు. ట్రెండీ ఎటైర్‌లో యంగ్ చాప్.. నోటిలో బబుల్‌గమ్‌తో కనిపించారు. ఈ రొమాంటిక్ స్టోరీ గ్లింప్స్‌ను అక్టోబర్ 10‌న విడుదల చేయబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రాలను డైరెక్ట్ చేసిన రవికాంత్ పేరెపు (Ravikanth Parepu) దర్శకుడు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Pawan Kalyan: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు

*********************************

*Tiger Nageswara Rao: సైన్ లాంగ్వేజ్‌లో కూడా.. ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతోనే రవితేజ రికార్డ్

********************************

*Mad: ‘మ్యాడ్’ బొమ్మకి హిట్ టాక్.. సంతోషంలో యూనిట్..

********************************

*Mechanic: పిల్లే కాదు.. సిద్ శ్రీరామ్ పాడిన పాట కూడా జనాలకి బాగా నచ్చేసింది.. అందుకే ఎక్కేసింది

********************************

*Siddharth: తలైవా ఫోన్‌ చేశారు.. చెన్నై వచ్చాక ‘చిత్తా’ చూస్తానన్నారు

*********************************

*Prema Vimanam Trailer: వేసుకోవడానికి చెడ్డీ లేదు కానీ.. విమానంలో పోతారంట..

********************************

Updated Date - 2023-10-06T21:57:42+05:30 IST