Pawan Kalyan: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-10-06T21:34:08+05:30 IST

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎందరో రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబుకు మేమంతా ఉన్నాం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. కానీ టాలీవుడ్ నుంచి ఇంత వరకు ఎవరు ఈ విషయంపై మాట్లాడలేదు. కనీసం మద్దతు తెలపలేదు. ఇదే విషయంపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సినీ ఇండస్ట్రీని మినహాయించాలని కోరారు.

Pawan Kalyan: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై (CBN Arrest) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఎందరో రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబుకు మేమంతా ఉన్నాం అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీ (Cinema Industry) నుంచి మాత్రం నట్టి కుమార్ (Natti Kumar) మినహా ఎవరూ ముందుకు వచ్చి మాట్లాడలేదు. నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) అయితే.. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య కాదని.. అన్ని పార్టీలు, అందులోని వ్యక్తులు సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన వారేనని.. అందుకే సున్నితమైన ఈ సమస్యపై ఎవరూ మాట్లాడటం లేదంటూ ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో చెప్పుకొచ్చారు. నిజంగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood) నుంచి ఇప్పటి వరకు చంద్రబాబుకి ఎవరూ మద్దతు తెలపలేదు. ఇదే విషయంపై తాజాగా జనసేన (Janasena) అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘సినిమా ఇండస్ట్రీ మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించడానికి కూడా సినిమా వాళ్లు భయపడతారు. గతంలో మేము ప్రజారాజ్యం (Prajarajyam) పార్టీ పెట్టినప్పుడు, ఎన్టీఆర్‌ (NTR)గారు తెలుగు దేశం పార్టీ పెట్టినప్పుడు.. పాలిటిక్స్‌కు సంబంధించి సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. కృష్ణగారు, ప్రభాకర్ రెడ్డిగారు.. అలాంటి వారంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా ఉన్నారు. ప్రతి పార్టీకి సినిమా ఇండస్ట్రీ నుంచి బేసిక్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు వైసీపీకి కూడా ఉంది. నాకు సపోర్ట్ ఉందని కూడా నేను గట్టిగా చెప్పలేను. అసలు ఈ విషయంపై నేనెప్పుడు దృష్టి కూడా పెట్టలేదు.


Pawan.jpg

సినిమా పరిశ్రమ అనేది వండర్‌ఫుల్ ఇండస్ట్రీ. అది పొలిటికల్ పార్టీ (Political Party) కాదు. ఇందులో కళాకారులతో పాటు 24 శాఖలలో పని చేసే వ్యక్తులు ఉంటారు. అందుకే వారు పొలిటికల్ హీట్‌ని వారు డైరెక్ట్‌గా తీసుకోలేరు. వాళ్లకి వంద సమస్యలు ఉంటాయి. వాళ్ల బాధని నేను అర్థం చేసుకోగలను. అలా అని వారు బాధపడటం లేదా.. ఎలాంటి అభిప్రాయం లేదా అని అనలేం. ఒకవేళ ఎవరైనా వచ్చి మాట్లాడితే.. వాళ్లని వైసీపీ వాళ్లు టార్గెట్ చేసేస్తారు. ఎన్టీఆర్‌గారు సీఎంగా ఉన్నప్పుడు.. ఆయన మీద తీయని సినిమా లేదు. ‘మండలాధీశుడు’ నుంచి తీస్తూనే ఉన్నారు. కోట‌గారు, పృధ్వీగారు.. ఎన్టీఆర్‌గారి క్యారెక్టర్లో నటించారు. ఇన్ని తీసినా ప్రభుత్వం తరపు నుంచి కక్ష సాధింపు చర్యలు వంటివి ఎప్పుడూ జరగలేదు. ఆ తర్వాత కలిసి కూడా యాక్ట్ చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఏం మాట్లాడాలన్న భయంతో ఉన్నారు.

ఎక్కడికో ఎందుకు.. ఒక సీనియర్ యాక్టర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, అశేష ప్రజాభిమానం కలిగిన వ్యక్తి సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Super Star Rajinikanth)గారు.. చంద్రబాబుగారి గురించి మంచి చెప్పారని ఎలా తిట్టారో చూశారు కదా! ఆయనని తిట్టని తిట్టు లేదు. అలాంటి ఆయననే అలా చేస్తే.. ఇక్కడున్న సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు అటువంటి వాళ్ల నోటిలో పడాలని ఎవరు కోరుకుంటారు. నాలాంటి మొండివాడు ఏమైనా బయటికి రావాలి.. ఎందుకంటే నేను ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నాను కాబట్టి నాకు ఆ కెపాసిటి ఉంది.. కానీ, నేను కూడా కేవలం సినిమాలలో ఉండి ఉంటే.. ఎంత వరకు మాట్లాడగలిగేవాడినో నాకూ తెలియదు. అందుకని.. ఫిల్మ్ ఇండస్ట్రీకి (Film Industry) ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను..’’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*Tiger Nageswara Rao: సైన్ లాంగ్వేజ్‌లో కూడా.. ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతోనే రవితేజ రికార్డ్

********************************

*Mad: ‘మ్యాడ్’ బొమ్మకి హిట్ టాక్.. సంతోషంలో యూనిట్..

********************************

*Mechanic: పిల్లే కాదు.. సిద్ శ్రీరామ్ పాడిన పాట కూడా జనాలకి బాగా నచ్చేసింది.. అందుకే ఎక్కేసింది

********************************

*Siddharth: తలైవా ఫోన్‌ చేశారు.. చెన్నై వచ్చాక ‘చిత్తా’ చూస్తానన్నారు

*********************************

*Prema Vimanam Trailer: వేసుకోవడానికి చెడ్డీ లేదు కానీ.. విమానంలో పోతారంట..

********************************

*Unstoppable with NBK Season 3: మరో దరువుకి సిద్ధమైన బాలయ్య.. ఎప్పటి నుంచి అంటే..

**********************************

Updated Date - 2023-10-06T21:34:08+05:30 IST