Jagapathi Babu: అభిమానం, ప్రేమ కంటే ఆశించడం ఎక్కువైందంటూ జగ్గు భాయ్ షాకింగ్ డెసిషన్

ABN , First Publish Date - 2023-10-07T20:39:58+05:30 IST

విలక్షణ నటుడిగా.. తన వద్దకు వచ్చిన ప్రతి పాత్రకు ప్రాణం పోస్తున్న జగ్గు భాయ్.. అదే మన జగపతిబాబుకి.. తన అభిమానులపై కోపం వచ్చింది. అభిమానులపై అంటే అందరిపై కాదండోయ్.. తనని ఇబ్బంది పెడుతున్న అభిమానులపై హర్ట్ అయినట్లుగా తెలుపుతూ.. తాజాగా ఆయన ఓ లెటర్‌ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Jagapathi Babu: అభిమానం, ప్రేమ కంటే ఆశించడం ఎక్కువైందంటూ జగ్గు భాయ్ షాకింగ్ డెసిషన్
Jagapathi Babu

విలక్షణ నటుడిగా.. తన వద్దకు వచ్చిన ప్రతి పాత్రకు ప్రాణం పోస్తున్న జగ్గు భాయ్ (Jaggu Bhai).. అదే మన జగపతిబాబు (Jagapathi Babu)కి.. తన అభిమానులపై కోపం వచ్చింది. అభిమానులపై అంటే అందరిపై కాదండోయ్.. తనని ఇబ్బంది పెడుతున్న అభిమానులపై కోపం ప్రదర్శిస్తూ తాజాగా ఆయన ఓ లెటర్‌ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇందులో.. తనని అభిమానులు ఎలా చూస్తారో.. అలాగే తను కూడా అభిమానులను చూసుకుంటూ వచ్చానని.. కానీ ఈ మధ్య అభిమానం, ప్రేమ కంటే కూడా ఆశించడం ఎక్కువైందని తెలుపుతూ.. అభిమాన సంఘాలకు, ట్రస్ట్‌కి ఇక నుంచి దూరంగా ఉంటానంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ లెటర్‌లో చెప్పుకొచ్చారు. జగపతిబాబు విడుదల చేసిన లేఖలో ఏముందంటే.. (Jagapathi Babu Fans)

‘‘అందరికీ నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం, శ్రేయోభిలాషుల్లాగ నా అభిమానులు కూడా నా పెరుగుదలకి ముఖ్య కారణంగా భావించాను. అలాగే వాళ్ళ ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని, వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి.. వాళ్లు నాకు తోడుగా ఉంటే.. నా అభిమానులకు నేను నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం, ప్రేమ కంటే ఆశించటం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు. (Jagapathi Babu Letter about Fans)


Jaga.jpg

మనసు ఒప్పుకోకపోయినా.. బాధతో చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. ఇక నుంచి నేను నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను.. జీవించండి, జీవించనివ్వండి’’ అంటూ జగపతిబాబు.. అభిమానులకు ఓ సందేశాన్ని పంపించారు. దీంతో అభిమానులు, నెటిజన్లు.. ఏమైంది జగ్గూ భాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానం పేరుతో తనని ఎవరో మోసం చేసి ఉంటారని, అందుకే జగపతిబాబు (Jagapathi Babu) ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారనేలా.. కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం జగపతిబాబు షేర్ చేసిన లేఖ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Mangalavaaram: ‘ఏమయ్యిందో ఏమిటో..’.. పాయల్ రాజ్‌పుత్ ఆగమాగం

**************************************

*Bubblegum: సుమక్క కొడుకు హీరోగా అరంగేట్రం.. దర్శకధీరుడు ఏం చేశారంటే..

**************************************

*Pawan Kalyan: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై సినీ ఇండస్ట్రీ స్పందించకపోవడంపై సంచలన వ్యాఖ్యలు

*********************************

*Tiger Nageswara Rao: సైన్ లాంగ్వేజ్‌లో కూడా.. ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతోనే రవితేజ రికార్డ్

********************************

*Mad: ‘మ్యాడ్’ బొమ్మకి హిట్ టాక్.. సంతోషంలో యూనిట్..

********************************

*Mechanic: పిల్లే కాదు.. సిద్ శ్రీరామ్ పాడిన పాట కూడా జనాలకి బాగా నచ్చేసింది.. అందుకే ఎక్కేసింది

********************************

Updated Date - 2023-10-07T20:39:58+05:30 IST