Mad: ‘మ్యాడ్’ బొమ్మకి హిట్ టాక్.. సంతోషంలో యూనిట్..

ABN , First Publish Date - 2023-10-06T19:21:14+05:30 IST

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మ్యాడ్’. నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకోవడంతో.. చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించింది.

Mad: ‘మ్యాడ్’ బొమ్మకి హిట్ టాక్.. సంతోషంలో యూనిట్..
Mad Movie Team

సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మ్యాడ్’ (Mad). నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర (Haarika Suryadevara) ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు. సూర్యదేవర నాగవంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు. ఈ సినిమా నేడు(అక్టోబర్ 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. షో షోకి వసూళ్ళను పెంచుకుంటోన్న నేపథ్యంలో.. తాజాగా చిత్రయూనిట్ థ్యాంక్స్ మీట్ నిర్వహించి.. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ (Naga Vamsi) మాట్లాడుతూ.. అందరూ కొత్త వాళ్ళు కలిసి చేసిన ప్రయత్నమిది. సినిమా బాగుంది, ఆడియన్స్‌కి నచ్చుతుందనే నమ్మకంతో.. ఈ సినిమాకి అంత కాన్ఫిడెంట్‌గా ప్రమోట్ చేశాము. కొత్త వాళ్ళు నటించిన ఈ సినిమాకి ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలు చేయడానికి మరింత ధైర్యం వచ్చింది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రాబోయే రోజుల్లో కలెక్షన్స్ మరింతగా పెరుగుతాయని ఆశిస్తున్నాం. మీడియా నుంచి కూడా ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. మీడియా స్పందన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. (Mad Movie Thanks Meet)


Mad-Movie.jpg

దర్శకుడు కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. యంగ్ స్టర్స్ అందరం కలిసి చేశాం. వంశీ అన్న ఒక్కటే మాట చెప్పాడు. గట్టిగా కొడుతున్నాం. ఆయన అన్నట్టుగానే జరిగింది. పాజిటివ్ టాక్ రావడంతో చాలా సంతోషంగా ఉందని అన్నారు. సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. మా గురించి జనాలు మాట్లాడుకోవడం అనేది మా ఫస్ట్ సక్సెస్. మంచిగా మాట్లాడుకోవడం అనేది మా సెకండ్ సక్సెస్. చాలా హ్యాపీగా ఉంది. వంశీ అన్న ఒక మాట అంటారు. పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటాం, గట్టిగా కొడతాం అని. నిజంగానే గట్టిగా కొట్టామని చెప్పుకొచ్చారు. ఈ స్థాయి రెస్పాన్స్ మాత్రం అసలు ఊహించలేదని.. చాలా సంతోషంగా ఉందని మరో హీరో నార్నే నితిన్ అంటే.. ‘నాకింకా కలలో ఉన్నట్లు ఉంది. ఇంతమంచి సినిమాతో పరిచయం అవుతానని అసలు ఊహించలేదు’ అని ఇంకో హీరో రామ్ నితిన్ అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Mechanic: పిల్లే కాదు.. సిద్ శ్రీరామ్ పాడిన పాట కూడా జనాలకి బాగా నచ్చేసింది.. అందుకే ఎక్కేసింది

********************************

*Siddharth: తలైవా ఫోన్‌ చేశారు.. చెన్నై వచ్చాక ‘చిత్తా’ చూస్తానన్నారు

*********************************

*Prema Vimanam Trailer: వేసుకోవడానికి చెడ్డీ లేదు కానీ.. విమానంలో పోతారంట..

********************************

*Unstoppable with NBK Season 3: మరో దరువుకి సిద్ధమైన బాలయ్య.. ఎప్పటి నుంచి అంటే..

**********************************

*Allu Arjun: ‘మేడమ్ టుస్సాడ్స్’లో మైనపు విగ్రహాం.. తొలి తెలుగు నటుడిగా రికార్డ్.. అదెలా?

********************************

Updated Date - 2023-10-06T19:21:14+05:30 IST