NBK: ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌లో చూసింది కొంతే.. చూడాల్సింది చాలా ఉంది.. అదంతా దాచి పెట్టాం!

ABN , First Publish Date - 2023-10-09T12:47:43+05:30 IST

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ క్రష్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలకాబోతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఆదివారం వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

NBK: ‘భగవంత్ కేసరి’ ట్రైలర్‌లో చూసింది కొంతే.. చూడాల్సింది చాలా ఉంది.. అదంతా దాచి పెట్టాం!
Nandamuri Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari). కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు వంటి వన్నీ హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో ఆదివారం వరంగల్‌ (Warangal)లో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. దర్శకులు వంశీపైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (Bhagavanth Kesari Trailer Launch Event)

ట్రైలర్ విడుదల అనంతరం నందమూరి బాలకృష్ణ (Balayya Speech) మాట్లాడుతూ.. ‘‘పోరాటాల పురిటి గడ్డగా పేరొందిన వరంగల్‌ ప్రజలు, నా అభిమానులందరికీ కళాభినందనలు. దసరా నవరాత్రులకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆ భద్రకాళి అమ్మవారే నన్ను ఇక్కడికి రప్పించారనుకుంటున్నాను. సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మలాంటి ఎందరో పోరాట యోధులను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాను. పెండ్యాల రాఘవయ్య వరంగల్‌ ఎంపీగా, హనుమకొండ ఎమ్మెల్మేగా, వర్దన్నపేట ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1984లో నాన్నగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు గుడివాడ, హిందూపూర్‌, నల్గొండ నుంచి పోటీ చేసి మూడు సీట్లు గెలవడం జరిగింది. అలాంటి మహానుభావులందరి స్మరించుకుంటున్నాను.


Balayya.jpg

నేను తొలిసారి ఈ సినిమాలో తెలంగాణ మాండలికంలో మాట్లాడాను. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనమున్న సినిమాలు అందించాలనే తాపత్రయం నాన్న గారి నుంచి పారంపర్యంగా వస్తోంది. ‘అఖండ’ తర్వాత ఏం చేయాలనుకున్న తరుణంలో ‘వీరసింహారెడ్డి’లో చేశాను. అది అన్ని రికార్డులు సృష్టించడం జరిగింది. తర్వాత ఏంటని అనుకుంటున్న తరుణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ లాంటి సరైన సినిమా దొరికింది. బాలకృష్ణ సినిమా అంటే పంచభక్ష పరమాన్నాలు వున్న భోజనంలా అన్నీ వుండాలి. ఇందులో కూడా అన్నీ వుంటాయి. టోటల్‌గా డిఫరెంట్ సినిమా ఇది. ట్రైలర్‌లో మీరు చూసింది కొంతే. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అదంతా దాచి పెట్టాం. దసరాకి ముందు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాం. దసరాకి ముందు దంచుదాం. కొత్త సినిమా చేసేముందు నేను నా పాత చిత్రాల గురించి చర్చించను. బాబీతో సినిమా చేయబోతున్నాను. ప్రతి సినిమాని సవాలుగా స్వీకరిస్తాను. చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు నేను చేయగలిగానంటే అది సమిష్టి కృషి, నా అదృష్టం, కళామతల్లి చల్లని దీవెనలుగా భావిస్తున్నాను. (NBK about Bhagavanth Kesari)

దర్శకుడు అనిల్ రావిపూడి చాలా ప్రతిభావంతుడు. సెట్స్‌లో జోకులు వేస్తూ నవ్విస్తూ ఉండేవాడు. ఈ సినిమా ఒక ప్రయాణం. ఒక వీరసింహా రెడ్డి, సింహా, లెజెండ్, అఖండ, శ్రీరామరాజ్యం, ఆదిత్య 369, భైరవద్వీపం.. ఇలా నా సినిమాలన్నీ ఒక ప్రయాణం. ఈ వేడుకలో మాట్లాడిన చాలా మంది ఎమోషనల్‌గా బరస్ట్ అయ్యారు. పాత్రల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఆ పాత్రల్లో వున్నామంటే సినిమాలో ఆ పాత్రలు ఎలా ఉంటాయో ప్రేక్షకులు ప్రత్యేక్షంగా చూస్తారు. కాజల్ వెర్సటైల్ నటి. ఇందులో చాలా చక్కని పాత్రని పోషించారు. శ్రీలీల ఇందులో నన్ను చిచ్చా చిచ్చా అని పిలుస్తుంది. తర్వాత సినిమాలో హీరోహీరోయిన్లుగా యాక్ట్‌ చేద్దామని ఆమెతో చెప్పా. ఇదే మాటను నా భార్య, కొడుకుతో కూడా చెప్పా. ‘ఏంటి డాడీ.. నేను హీరోగా రాబోతుంటే నువ్వేమో ఆమెకు ఆఫర్‌ ఇస్తావా?( నవ్వుతూ) అన్నాడు’. శ్రీలీల చాలా మంచి నటి. ఇందులో చేసిన పాత్ర ఆమె కెరీర్ లో గుర్తుండిపోతుంది. ఇందులో అర్జున్ రాంపాల్ తో నటించడం గొప్ప అనుభూతి. మా ఇద్దరి కాంబినేషన్ అద్భుతంగా వుంటుంది. మిగతా నటీనటులు అందరూ అద్భుతంగా చేశారు. (Bhagavanth Kesari Trailer Launch Event)


Dasara.jpg

కెమెరామెన్ తమ్ముడు ప్రసాద్‌తో మాది చాలా మంచి ప్రయాణం. నా ప్రతి కదలికని ఒడిసిపట్టుకునే కెమెరామెన్ తను. నా సినిమా అంటే తమన్‌కి పూనకం వస్తుంది. బాక్సు బద్దలైపోయేలా కొడతాడు. అఖండ థియేటర్స్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు. ఇక మా ఎడిటర్ తమ్మిరాజు చాలా మంచి వర్క్ చేశారు. అలాగే డ్యాన్స్ మాస్టర్స్, ఫైట్ మాస్టర్స్ ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమా గురించి చాలా వుంది. ఇదొక చరిత్ర, ఎపిక్. అంత అద్భుతంగా మా దర్శకుడు అనిల్ రావిపూడిగారు ఈ సినిమాని తీర్చిదిద్దారు. మంచి పాటలు, ఫైట్లు, డైలాగులు, యాక్షన్ సీన్స్‌తో సినిమా అంతా ఒక పండగలా వుంటుంది. నిర్మాతలు హరీష్ పెద్ది, సాహు చాలా శ్రద్ధతో అన్ని జాగ్రత్తలు తీసుకొని సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇన్ని కోట్లమంది అభిమానులని పొందటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను సంపాదించింది అభిమానుల అభిమానమే. అందరికీ కృతజ్ఞతలు’’ అని చెప్పుకొచ్చారు. (NBK about BK)


ఇవి కూడా చదవండి:

============================

*Ganjam: మ్యారేజ్ అనంతరం త్రిగుణ్ చేస్తున్న సినిమా ఇదే.. టీజర్ విడుదల

**********************************

*Ayalaan: ట్రెండింగ్‌లో ‘అయలాన్‌’.. అందుకే సంక్రాంతికి అంటోన్న ఎస్.కె.

*************************************

*Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ లుక్.. అరాచకం అంతే..!

**********************************************

*Jagapathi Babu: అభిమానం, ప్రేమ కంటే ఆశించడం ఎక్కువైందంటూ జగ్గు భాయ్ షాకింగ్ డెసిషన్

********************************************************

*Mangalavaaram: ‘ఏమయ్యిందో ఏమిటో..’.. పాయల్ రాజ్‌పుత్ ఆగమాగం

**************************************

Updated Date - 2023-10-09T12:47:43+05:30 IST