Ganjam: మ్యారేజ్ అనంతరం త్రిగుణ్ చేస్తున్న సినిమా ఇదే.. టీజర్ విడుదల

ABN , First Publish Date - 2023-10-09T12:19:10+05:30 IST

యంగ్ హీరో త్రిగుణ్, నివేదితల వివాహం రీసెంట్‌గా గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. వివాహం తర్వాత త్రిగుణ్ నటించిన చిత్ర టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘గంజామ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ సమక్షంలో మేకర్స్ విడుదల చేశారు.

Ganjam: మ్యారేజ్ అనంతరం త్రిగుణ్ చేస్తున్న సినిమా ఇదే.. టీజర్ విడుదల
Ganjam Movie Still

యంగ్ హీరో త్రిగుణ్ (Thrigun), నివేదితల వివాహం రీసెంట్‌గా గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. వివాహం తర్వాత త్రిగుణ్ నటించిన చిత్ర టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఏవిఆర్ ఆర్ట్స్, ఏ.యు అండ్ ఐ బ్యానర్స్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘గంజామ్’ (Ganjam) అనే టైటిల్‌ని ఖరారు చేశారు. రత్నాజీ (Rathnaji) నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ కుమార్ ఆకిరి (Suresh Kumar Aakiri) దర్శకత్వం వహించారు. త్రిగుణ్, ప్రణమ్ దేవరాజ్, హ్రితిక శ్రీనివాస్, విస్మయ, దేవరాజ్, రఘు కుంచె, అనిత చౌదరి, ధనరాజ్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ సమక్షంలో మేకర్స్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. నేను చేసున్న 23వ సినిమా ‘గంజామ్’. నన్ను ఇప్పటి వరకు ఆదరిస్తూ.. అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ రోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడికో వెళుతోంది.. అందులో మేము ఉన్నామని తలుచుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. మా సినిమా నిర్మాత రత్నాజీ‌గారికి, దర్శకుడు సురేష్ కుమార్‌గారికి, రఘు కుంచె‌గారికి.. ఇంకా అందరూ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు. త్వరలో విడుదల కాబోతున్న మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. (Ganjam Movie Teaser Launched)


Thrigun.jpg

నిర్మాత రత్నాజీ మాట్లాడుతూ.. ఒక మంచి ప్రయత్నం మా గంజామ్ సినిమా. మా ఈ ప్రయత్నాన్ని అందరూ స్వాగతిస్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని తెలపగా.. డైరెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాత రత్నాజీ‌గారు నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు ధన్యవాదాలు. హీరో త్రిగుణ్ చాలా మెచ్యూరిటీతో నటించారు. ఆయనకు ఈ సినిమా మరో మంచి హిట్ సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. యాక్షన్, ఎంటర్‌టైనర్‌తో పాటు సామాజిక సృహ కలిగిన సినిమా ‘గంజామ్’. రఘు కుంచె అద్భుతమైన సంగీతాన్ని అందించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా అందరినీ ఆలోచింపజేసే సినిమా అవుతుందని తెలిపారు. కథా బలం ఉన్న సినిమాలను ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని.. గంజామ్ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నట్లుగా సంగీత దర్శకుడు రఘు కుంచె చెప్పుకొచ్చారు. (Ganjam Movie Teaser)


ఇవి కూడా చదవండి:

============================

*Ayalaan: ట్రెండింగ్‌లో ‘అయలాన్‌’.. అందుకే సంక్రాంతికి అంటోన్న ఎస్.కె.

*************************************

*Manchu Lakshmi: మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ లుక్.. అరాచకం అంతే..!

**********************************************

*Jagapathi Babu: అభిమానం, ప్రేమ కంటే ఆశించడం ఎక్కువైందంటూ జగ్గు భాయ్ షాకింగ్ డెసిషన్

********************************************************

*Mangalavaaram: ‘ఏమయ్యిందో ఏమిటో..’.. పాయల్ రాజ్‌పుత్ ఆగమాగం

**************************************

*Bubblegum: సుమక్క కొడుకు హీరోగా అరంగేట్రం.. దర్శకధీరుడు ఏం చేశారంటే..

**************************************

Updated Date - 2023-10-09T12:19:10+05:30 IST